టాలీవుడ్ వైపు మణిరత్నం..గీతాంజలి-2!
పాన్ ఇండియా వైడ్ ఆయనకున్న గుర్తింపు కారణంగా హిందీ సహా మరికొన్ని భాషల్లోనూ విడుదలవు తుంటాయి.
By: Srikanth Kontham | 15 Aug 2025 10:00 PM ISTమణిరత్నం తెలుగు సినిమా తెరకెక్కించి మూడు దశాబ్ధాలకు పైగానే అవుతోంది. 1989లో నాగార్జున కథానా యకుడిగా `గీతాంజలి` తెరకెక్కించి గొప్ప విజయాన్ని అందించారు. దర్శకుడిగా తెలుగులో తొలి చిత్ర మదే. అప్పటికే మలయాళం, తమిళ్ లో సినిమాలు చేసారు. కన్నడ లో కూడా ఎంట్రీ ఇచ్చేసారు. దీంతో తెలుగు సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అన్న సమయంలో టాలీవుడ్ లోనూ షురూ చేసి సర్ ప్రైజ్ చేసారు. అయితే ఆ తర్వాత మళ్లీ మణిరత్నం తెలుగు ఇండస్ట్రీ వైపు చూడలేదు.
అనువాదమే ఆనందంగా:
కేవలం సొంత పరిశ్రమ అయిన తమిళ చిత్రాలకే పరిమితయ్యారు. మధ్యలో హిందీ చిత్రాలు కొన్నింటిని టచ్ చేసారు. అవి కూడా ఓ ఎంట్రీలాగే చేసారు. గీతాంజలి తర్వాత తెలుగు సినిమా చేయాలని ఎన్నో వేదికలపై అభిమానులు అభ్యర్దించినా ఆయన మాత్రం కరుణించలేదు. తాను ఏ సినిమా తీసిన కోలీవుడ్ లోనే తీస్తాను? అన్నట్లు పనిచేసారు. అక్కడ తీసిన చిత్రాలనే తెలుగులోనూ అనువదించారు. అయితే ఆయన డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమా తెలుగులో తప్పక అనువాదమవుతుంది.
ఆనాడే పాన్ ఇండియా:
పాన్ ఇండియా వైడ్ ఆయనకున్న గుర్తింపు కారణంగా హిందీ సహా మరికొన్ని భాషల్లోనూ విడుదలవు తుంటాయి. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా? ఆణిముత్యాల్లాంటి చిత్రాలెన్నో. అలాగని ప్లాప్ లు లేవని కాదు. అలాంటి అట్టర్ ప్లాపులు కూడా ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్ ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా చేసి సక్సస్ అయ్యారు. అయితే అటుపై చేసిన `థగ్ లైఫ్` మాత్రం దారుమైన ఫలితాన్ని చవి చూసింది. చివరికి మీడియా ముఖంగా క్షమాపణలు సైతం చెప్పాల్సి వచ్చింది.
గీతాంజలి 2 ప్లాన్ చేస్తున్నారా?
నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో మణిరత్నం నోట ఏనాడు క్షమా పణ అనే మాట రాలేదు. తొలిసారి `థగ్ లైఫ్` విషయంలో క్షమాపణ తప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులో కి వచ్చింది. మణిరత్నం ఓ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త తెరపైకి వచ్చింది. అదీ అక్కినేని వారసుడు నాగచైతన్యతో తన మార్క్ ప్యూర్ లవ్ స్టోరీ చేయాలనుకుంటున్నా రుట. తండ్రికి `గీతాంజలి` తో హిట్ ఇచ్చిన మణిసార్ తనయుడికి కూడా అలాంటి లవ్ స్టోరీ హిట్ ఇవ్వాల నుకుంటున్నారేమో.
