Begin typing your search above and press return to search.

ఆరేళ్ల తర్వాత మళ్లీ కలవబోతున్న స్టార్స్..

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు మణిరత్నం సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. ఒక లవ్ స్టోరీ ని డీల్ చేసే విధానం మణిరత్నం ను చూసి నేర్చుకోవచ్చు.

By:  Madhu Reddy   |   8 Nov 2025 4:47 PM IST
ఆరేళ్ల తర్వాత మళ్లీ కలవబోతున్న స్టార్స్..
X

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలెంటెడ్ దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు శంకర్, మణిరత్నం. మణిరత్నం సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు మణిరత్నం సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. ఒక లవ్ స్టోరీ ని డీల్ చేసే విధానం మణిరత్నం ను చూసి నేర్చుకోవచ్చు.

మణిరత్నం ఏ జోనర్ లో సినిమా చేసినా కూడా తను చేసే లవ్ స్టోరీలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే అతన్ని లవ్ గురు అని కూడా అంటారు. తెలుగులో అందాల రాక్షసి సినిమాతో హను రాఘవపూడి పరిచయం అయినప్పుడు మణిరత్నంను ఇమిటేట్ చేస్తున్నాడు అని అప్పట్లో కామెంట్ కూడా వచ్చాయి. అంటే లవ్ స్టోరీస్ పైన మణిరత్నం ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మణిరత్నం సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇకపోతే మణిరత్నం చాలామందిని ఒకచోట చేరుస్తూ చిక్కి చివంత వానం అనే సినిమాను చేశారు. అరవిందస్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్ వీరందరూ కలిసి ఆ సినిమాలో నటించారు. అయితే ఇంత మంది స్టార్ కాస్ట్ సినిమాలో ఉండటంతో సినిమా మీద అప్పట్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

నాయగన్ సినిమా తర్వాత కమల్ హాసన్ తో థగ్ లైఫ్ అనే సినిమాను చేశారు మణిరత్నం. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. శింబు హీరోగా మణిరత్నం ఒక సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శింబు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది.

మళ్లీ విజయ్ సేతుపతి హీరోగా మణిరత్నం సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

మరోవైపు విజయ్ సేతుపతి తెలుగు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అనేది విజయ్ సేతుపతి కంటే కూడా పూరి జగన్నాథ్ కి చాలా ఇంపార్టెంట్.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పటివరకు ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ సినిమా చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు వాటన్నిటినీ క్లియర్ చేయాలి అంటే పూరి జగన్నాథ్ సక్సెస్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.