Begin typing your search above and press return to search.

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

దర్శకుడు మణిరత్నం ఇప్పటివరకు తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్‌లతో సినిమా చేయలేదు. విజయ్‌కు కెరీర్ ప్రారంభంలో మణిరత్నం కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైందని ప్రచారం ఉంది. ఇక 'ఆయుధ ఎళుత్తు'లో ఇన్బా పాత్రకు తొలుత అజిత్‌ను పరిశీలించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పష్టత లేదు.

By:  Priya Chowdhary Nuthalapti   |   11 Nov 2026 4:00 PM IST
అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?
X

తమిళ దర్శకుడు మణిరత్నం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో భాషల హీరోలు.. ఈ దర్శకుడితో ఎప్పుడు సినిమా చేద్దామా అని ఎదురుచూసేవారు.

అందుకు తగ్గట్టుగానే మణిరత్నం ఇతర భాషల హీరోలతో కూడా సినిమాలు చేశారు. పాన్ ఇండియా అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే.. ఆయన పాన్ ఇండియా దర్శకుడి లెవెల్ కి ఎదిగారు. అయితే తమిళంలో ఇంత గొప్ప దర్శకుడు.. తమ సొంత తమిళ ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడం మాత్రం.. అందరిని ఆశ్చర్యపరిచే విషయమే.

అసలు విషయానికి వస్తే.. కోలీవుడ్‌లో ఎన్నో సంవత్సరాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న అజిత్, విజయ్.. ఎంతో మంది ప్రముఖ దర్శకులతో పనిచేశారు. కానీ ఇంతవరకు మణిరత్నం దర్శకత్వంలో మాత్రం నటించలేదు. ఈ విషయం తమిళ ప్రేక్షకులకే కాకుండా.. ఇతర భాషల ప్రేక్షకులకు కూడా వినడానికి ఆశ్చర్యంగానే ఉండొచ్చు. మరి దీనికి గల కారణాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.

విజయ్ కెరీర్ ప్రారంభంలో.. అతను మణిరత్నం కార్యాలయానికి ఒక సినిమా కోసం వెళ్తే.. అక్కడ ఆయనకి ఒక అవమానం కలిగించే సంఘటన జరిగిందంట. అయితే ఆ సంఘటన వలన విజయ్ నిరాశకు గురికావడమే కాకుండా, ఆ తర్వాత మణిరత్నంతో సినిమా చేసే ఆసక్తి చూపించలేదని.. కొన్ని కోలీవుడ్ వర్గాల కథనాలు చెబుతూ ఉంటాయి. అయితే ఈ విషయంపై విజయ్ కానీ, మణిరత్నం కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. అంతే కాకుండా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్టులో.. విజయ్ పేరు కూడా వినిపించింది. కానీ ఆ సినిమా అప్పట్లో కార్యరూపం దాల్చలేదు.

మరోవైపు అజిత్ విషయంలోనూ ఒక ఆసక్తికరమైన వార్త తమిళ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆయుధ ఎళుత్తు సినిమాలో ఇన్బా పాత్ర కోసం తొలుత అజిత్‌ను పరిశీలించారని కొన్ని కథనాలు వచ్చాయి. చివరకు ఆ పాత్రను మాధవన్ చేశారు. అయితే అజిత్ ఆ అవకాశాన్ని ఎందుకు అంగీకరించలేదు అనే విషయంలో క్లారిటీ లేదు.

సాధారణంగా మణిరత్నం మల్టీస్టారర్లు చేయడంలో దిట్ట. మరి అలాంటి ఈ దర్శకుడు తమిళ సూపర్ స్టార్స్ అజిత్, విజయ్ తో కానీ ఒక సినిమా చేసి ఉంటే.. అది ఎలాంటి సంచలనం సృష్టించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇంకా ఆ ఛాన్స్ ఉండేలా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు.. కాబట్టి ఈ కాంబినేషన్ ఒక కలగానే మిగిలిపోయేటట్టు ఉంది.