మణిరత్నం ప్రశంసంతో స్కైలో యువ దర్శకుడు!
భారతీయ చిత్రసీమలో దిగ్గజ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మణిరత్నం నోట ప్రశంస వినడం ఏ సినీ మేకర్‌కైనా లభించే అత్యున్నత పురస్కారంతో సమానం.
By: Srikanth Kontham | 27 Sept 2026 5:00 PM ISTభారతీయ చిత్రసీమలో దిగ్గజ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మణిరత్నం నోట ప్రశంస వినడం ఏ సినీ మేకర్‌కైనా లభించే అత్యున్నత పురస్కారంతో సమానం. సాధారణంగా తోటి దర్శకుల గురించి లేదా యువ తరం మేకర్స్ పనితనం గురించి ఆయన బహిరంగంగా ప్రశంసలు కురిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన గౌరవాన్ని తాజాగా విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సాధించారు. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `డొరోథి` చిత్రాన్ని ఉద్దేశించి మణిరత్నం చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.
దశాబ్దాలుగా తనదైన శైలిలో సినిమా రంగాన్ని శాసిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మణిరత్నం సినిమా ప్రమాణాలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. ఆయన ఒక సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారంటే అందులో వినూత్నమైన కథాంశం, అసాధారణమైన సాంకేతిక పరిణతి ఉండి తీరాల్సిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `డొరోథి` చిత్రం సరిగ్గా మణిరత్నం అంచనాలను అందుకోవడమే కాకుండా, ఆయనను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని మేకింగ్ విజన్, కథను నడిపించిన తీరు మణిరత్నం వంటి మహామహుడిని సైతం ముగ్ధుడిని చేసింది.
`పిజ్జా` సినిమాతో ట్రెండ్ సెట్టర్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్ అటుపై `జిగర్తాండ`, `పేట్టా`, `జిగర్తాండ డబుల్ ఎక్స్` వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను ఏర్పరుచుకున్నారు. విలక్షణమైన కథాంశాలు, ఊహించని మలుపులతో ప్రేక్షకులను మెప్పించే ఆయన `డొరోథి` చిత్రంతో తన సృజనాత్మకతను మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ చిత్రంలో కార్తీక్ ఎంచుకున్న పాయింట్ ఇచ్చిన దృశ్యరూపం కార్తీక్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన ప్రయోగంగా నిలిచిందని సినీ వర్గాలు కొనియాడుతున్నాయి.
`డొరోథి` చిత్రంలో సన్నివేశాల నిర్మాణం, నటీనటుల నుంచి అత్యుత్తమ నటనను రాబట్టుకున్న విధానం , సాంకే తిక విలువలను మణిరత్నం ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా సినిమాలో భావోద్వేగాలను పండించిన తీరు, స్క్రీన్‌ప్లే నడిపిన విధానం ప్రేక్షకుడిని గ్రిప్పింగ్‌గా కట్టిపడేసేలా ఉందని మణిరత్నం అభిప్రాయపడ్డారు. ఒక దిగ్గజ దర్శకుడు `డొరోథి` విజన్‌ను గుర్తించి అభినందించడం, కార్తీక్ సుబ్బరాజ్ వర్కింగ్ స్టైల్‌కు దక్కిన అతిపెద్ద పురస్కారంగా ఇండస్ట్రీ పండితులు భావిస్తున్నారు.
మణిరత్నం నుండి లభించిన ప్రశంసలపై కార్తీక్ సుబ్బరాజ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `డొరోథి`ని మణిరత్నం మెచ్చుకోవడం జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశంస తనపై బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించడానికి కొండంత స్ఫూర్తిని ఇస్తుందని వ్యాఖ్యానించారు.
