మణిరత్నం తీసుకున్న డెసిషన్ వెనుక అసలు ప్లాన్ ఏంటి?
ఇండియన్ సినీ హిస్టరీలో మణిరత్నం పేరు వినగానే గుర్తుకు వచ్చేది కేవలం గొప్ప కథలు, అద్భుతమైన పాత్రలు మాత్రమే కాదు.. ఆయన సినిమాలకు ఉండే స్పెషల్ విజువల్ వరల్డ్ కూడా.
By: Sravani Lakshmi Srungarapu | 5 Sept 2026 11:08 AM ISTఇండియన్ సినీ హిస్టరీలో మణిరత్నం పేరు వినగానే గుర్తుకు వచ్చేది కేవలం గొప్ప కథలు, అద్భుతమైన పాత్రలు మాత్రమే కాదు.. ఆయన సినిమాలకు ఉండే స్పెషల్ విజువల్ వరల్డ్ కూడా. తెరపై ప్రతి ఫ్రేమ్‌ను ఒక పెయింటింగ్‌లా తీర్చిదిద్దడంలో మణిరత్నం మార్క్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. అందుకే ఆయన కొత్త సినిమా విషయంలో ఇప్పుడు హీరోహీరోయిన్లతో పాటు కెమెరా వెనుక జరిగిన ఒక ఆసక్తికరమైన మార్పు కూడా సినీ వర్గాల్లో డిస్కషన్‌కు వస్తోంది.
సాధారణంగా మణిరత్నం తనకు బాగా పరిచయమైన, తన విజువల్ భాషను అర్థం చేసుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్లతో కలిసి పనిచేస్తుంటారు. రవి వర్మన్, రవి కె. చంద్రన్, సంతోష్ శివన్ వంటి టాప్ సినిమాటోగ్రాఫర్లతో ఆయన కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు విజువల్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. కానీ ఈసారి మాత్రం ఆయన కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కొత్త లవ్ స్టోరీ కోసం బెంగాలీ సినిమాటోగ్రాఫర్ అన్విక్ ముఖోపాధ్యాయ్‌ను సెలెక్ట్ చేయడం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. బాలీవుడ్‌లో గులాబో సితాబో వంటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన కెమెరా పనితీరును మణిరత్నం తన ప్రపంచంలోకి తీసుకురావడం వెనుక ఏదో కొత్త క్రియేటివ్ ఆలోచన ఉందనే డిస్కషన్ మొదలైంది.
మరోవైపు ఈ సినిమా కథ కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. విజయ్ సేతుపతి పేరు వినగానే ఇప్పటికీ చాలామంది ఆడియన్స్ కు గుర్తుకు వచ్చే సినిమాల్లో 96 ముందుంటుంది. ఆ సినిమాలో ఆయన పండించిన సున్నితమైన ప్రేమకథ, ఎమోషన్స్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఇప్పుడు మళ్లీ ఆయనొక ప్రేమకథలో కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈసారి ఆయనకు జోడీగా సాయిపల్లవి ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకతను జోడిస్తుంది. నేచురల్ యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ ను స్క్రీన్ పై జీవించేలా చేసే ఇద్దరు నటులు ఒకే ప్రేమకథలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కోల్‌కతా నేపథ్యంలో జరిగిన షూటింగ్‌కు సంబంధించిన విజువల్ డిస్కషన్స్ కూడా కూడా ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. సెప్టెంబర్ 7న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేస్తామని చెప్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. 96 తరహాలో విజయ్ సేతుపతి మరోసారి ఆడియన్స్ ను ప్రేమకథతో కదిలిస్తారా? లేక మణిరత్నం తన ప్రత్యేక శైలిలో పూర్తిగా కొత్త ప్రేమ ప్రపంచాన్ని చూపించబోతున్నారా? ముఖ్యంగా కొత్త సినిమాటోగ్రాఫర్ కెమెరా ద్వారా మణిరత్నం విజువల్ ప్రపంచానికి ఎలాంటి కొత్త రంగులు చేరతాయన్నదే ఈ సినిమా విషయంలో అత్యంత ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తోంది.
