Begin typing your search above and press return to search.

నవీన్ పోలిశెట్టి మణిరత్నం ప్రాజెక్ట్.. అసలు మ్యాటర్ ఇది!

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి అందరికీ తెలిసిందే. తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు.

By:  M Prashanth   |   7 Aug 2025 12:20 AM IST
నవీన్ పోలిశెట్టి మణిరత్నం ప్రాజెక్ట్.. అసలు మ్యాటర్ ఇది!
X

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి అందరికీ తెలిసిందే. తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తన టాలెంట్ ఏంటో చూపించారు.

ఇప్పడు అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. మారి దర్శకత్వం వహిస్తుండగా.. నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఆ మూవీ.. 2026 సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే నవీన్ వద్దకు వివిధ ప్రాజెక్టులు వస్తున్నా వెంటనే ఆయన ఓకే చేయడం లేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం వెళ్లి నవీన్ పోలిశెట్టికి కథ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నవీన్ కు కథ బాగా నచ్చిందని, దీంతో సినిమా ఫిక్స్ అయినట్లేనని జోరుగా ప్రచారం సాగింది.

కానీ నవీన్ పోలిశెట్టి బదులు స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు మణిరత్నం సిద్ధమయ్యారని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నారని.. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా మూవీ రూపొందనుందని ప్రచారం జరుగుతోంది.

నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారగా.. నెటిజన్లు, సినీ ప్రియులు తెగ స్పందిస్తున్నారు. మణిరత్నం నెపోటిజం ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విక్రమ్ కొడుకుకు బదులుగా నవీన్ పోలిశెట్టి అర్హుడని చాలా మంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మణిరత్నం వంటి దర్శకుడు స్టార్ హీరోల పిల్లలకు మద్దతు ఇవ్వడం కంటే ప్రతిభను ప్రోత్సహించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారగా.. అసలు మ్యాటర్ అది కాదని తెలుస్తోంది.

ఎందుకంటే నవీన్ పోలిశెట్టి మూవీ గురించి థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో ఇప్పటికే మణిరత్నం మాట్లాడారు. అసలు ఆ న్యూస్ ఫేక్ అని తెలిపారు. నవీన్ పోలిశెట్టితో మూవీ చేస్తానని అనుకోలేదని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వస్తున్న వార్తలు రూమర్స్ అని క్లియర్ గా తెలుస్తోంది.