Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘ఇంజి వెల్లం’ సినిమాలో సాయిపల్లవి ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణి పాత్రలో కనిపించనుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   12 Nov 2026 12:00 AM IST
ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!
X

`ఓకే బంగారం` చిత్రంలో నిత్యా మీన‌న్ పాత్ర‌ను ఎంతో అద్భుతంగా చూపించిన మ‌ణిర‌త్నం నుంచి ఇప్పుడు మ‌రో అద్భుత‌మైన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్ సినిమాగా రూపొందుతోంది. `ఇంజి వెల్లం` టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి లాంటి జాతీయ ఉత్త‌మ న‌టుడి సర‌స‌న సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి గృహిణిగా, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిగా న‌టిస్తోంది. కోల్ క‌త బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిర‌త్నం లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో దీనిపై చాలా చ‌ర్చ సాగుతోంది. అయితే ద‌ర్శ‌క‌దిగ్గ‌జం ఈ ట్యాలెంటెడ్ న‌టి పాత్ర‌ను ఎలా మ‌లిచారో అనే చ‌ర్చ కొన‌సాగుతోంది.

మ‌ణిర‌త్నం త‌న సినిమాల్లో నాయ‌కానాయిక‌ల మ‌ధ్య రొమాంటిక్ కోణాన్ని అద్భుతంగా ఆవిష్క‌రిస్తారు. అలాంటి ఆవిష్క‌ర‌ణ‌లు గ‌తంలో ఎన్నో. ఆయ‌న‌ సినిమాల్లో నాయికల పాత్రలు కేవలం గ్లామర్ కోసమే ఉండవు. కథను ముందుకు నడిపించే ఆత్మలా ఉంటాయి. `ఓకే బంగారం` చిత్రంలో నిత్యా మీనన్ పాత్ర ఒక అర్బన్ ఆర్కిటెక్ట్‌గా, రిలేషన్‌షిప్‌పై స్పష్టమైన అభిప్రాయాలున్న మోడరన్ అమ్మాయిగా ఎంత సహజంగా కనిపిస్తుందో, మనసు విరిగినప్పుడు అంతే తీవ్రంగా స్పందిస్తుంది. ఇప్పుడు `ఇంజి వెల్లం`లో సాయిపల్లవి పాత్రను కూడా అదే స్థాయిలో ఎలాంటి కృత్రిమ‌త్వం లేని సహజమైన పాత్రగా మణిరత్నం మలచినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు సాయిపల్లవి ఎక్కువగా కాలేజీ స్టూడెంట్ గా డాన్సర్ గా లేదా స్వతంత్ర భావాలున్న యువతి పాత్రల్లోనే ఎక్కువగా మెప్పించారు. అయితే అందుకు భిన్నంగా ప‌రిణ‌తి చెందిన గృహిణిగా న‌టిస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా న‌టించ‌డం స‌వాల్ అయినా కానీ.. దానిని నిరూపిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది.

సాయి ప‌ల్ల‌వి నిజానికి క‌ళ్ల‌తోనే భావాల‌ను అద్భుతంగా ప‌లికించ‌గ‌ల‌దు గ‌నుక ఈ పాత్ర‌కు ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విజ‌య్ సేతుప‌తితో పోటీప‌డుతూ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బరిచేందుకు ఆస్కారం ఉంది. ఈ ఇద్ద‌రి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ క్రేజీ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండ‌టం మ‌రో ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌. `ఇంజి వెల్లం` ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 29న థియేటర్లలో విడుదల కానుంది. నితీష్ తివారీ `రామాయ‌ణం`లో సీత పాత్ర‌తో చ‌ర్చ‌ల్లో నిలిచిన సాయిప‌ల్ల‌వి త‌దుప‌రి మ‌ణిర‌త్నం సినిమాతో పాటు, అమ‌ర‌న్ ద‌ర్శ‌కుడితో సినిమాలోను ఛాలెంజింగ్ పాత్ర‌లు పోషిస్తుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.