Begin typing your search above and press return to search.

పొన్నియన్ సెల్వన్ ఆయన వల్లే సాధ్యం!

బాహుబలి ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసిన సినిమా.. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఈ బాహుబలి మేనియా కొనసాగుతూనే ఉంది.

By:  Madhu Reddy   |   4 Nov 2025 1:00 AM IST
పొన్నియన్ సెల్వన్ ఆయన వల్లే సాధ్యం!
X

బాహుబలి ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసిన సినిమా.. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఈ బాహుబలి మేనియా కొనసాగుతూనే ఉంది. బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో.. తెలుగు సినిమా దర్శకుడు తలచుకుంటే ఏం చేయగలడో.. ఈ సినిమాతో చేసి చూపించారు. ఒకరకంగా ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని రుచి చూపించాడు. అయితే అలాంటి బాహుబలి సినిమా వల్లే పాన్ ఇండియా ట్రెండ్ మొదలవ్వడంతో పాటు సీక్వెల్స్ ట్రెండ్ కూడా మొదలైంది. అప్పటివరకు ఒక సినిమాని రెండు భాగాలుగా తీయవచ్చని ఏ డైరెక్టర్ కూడా ఆలోచించలేదు. కానీ మొట్ట మొదటిసారి ఈ ఆలోచన దర్శకుడు రాజమౌళికి వచ్చింది. అలా డైరెక్టర్ రాజమౌళి చేసిన సినిమాల్లో చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్నారు. అలా ఎంతోమంది దర్శకులు సినిమాలకు ప్రీక్వెల్స్, సీక్వెల్స్ తీస్తూ ముందుకు వెళ్తున్నారు.

అయితే అలాంటి బాహుబలి తాజాగా రెండు పార్ట్ లను కలుపుకొని బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు బాహుబలి ది ఎపిక్ రికార్డు కలెక్షన్స్ కూడా సాధిస్తోంది.ఈ నేపథ్యంలోనే బాహుబలి మూవీ గురించి డైరెక్టర్ మణిరత్నం మాట్లాడిన ఒక వీడియో మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ వేళ మరోసారి వైరల్ అవుతోంది. అందులో మణిరత్నం బాహుబలి సినిమా వల్లే పొన్నియన్ సెల్వన్ తీయగలిగాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరి అందులో మణిరత్నం ఏం మాట్లాడారంటే.. "ఒక సినిమాను రెండు భాగాలుగా తీయవచ్చని రాజమౌళి చూపించారు. ఆయన బాహుబలి సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొనే నేను పొన్నియన్ సెల్వన్ ని రెండు భాగాలుగా తీశాను.బాహుబలి లేనిదే పొన్నియన్ సెల్వన్ మూవీ లేదు. ఈ విషయాన్ని నేను రాజమౌళి దగ్గర కూడా ప్రస్తావించాను. బాహుబలి సినిమాని రెండు పార్ట్ లుగా తీయడం వల్లే నేను కూడా పొన్నియన్ సెల్వన్ సినిమాని రెండు పార్ట్ లుగా తీశాను. రాజమౌళి వల్లే మన సినిమాలు ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు సాధించాయి".. అంటూ మణిరత్నం చెప్పిన వీడియో మరొకసారి వైరల్ అవుతుంది.

మణిరత్నం ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారంటే ..గతంలో అంటే 2022లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ పేరుతో జరిగిన ఓ సదస్సులో మణిరత్నం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటి వీడియో మళ్లీ ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతుంది. మణిరత్నం చెప్పినట్లు రాజమౌళి వల్లే మనం ఇప్పుడు సీక్వెల్స్ చూస్తున్నాం. పాన్ ఇండియా సినిమాల్ని చూస్తున్నాం.ఆయన ఒకవేళ బాహుబలి సినిమాని ఇలా రెండు పార్ట్ లుగా తీసుకురాకపోయి ఉంటే కచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మార్పులు వచ్చేవి కావు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళిని దర్శక ధీరుడు అని అందుకే అంటారు అంటూ ఆయన ఫ్యాన్స్ ఈ వీడియో చూసి మాట్లాడుకుంటున్నారు.