సినిమాలు ఆగిపోయాయి- బాకీలు మిగిలిపోయాయి!
ఈ క్రమంలోనే కొందరు నిర్మాతలు వచ్చి 15 రోజుల పాటు మాత్రమే పనిచేయమని అడిగితే ఎలాంటి రుసుము ఆశించకుండా వెంటనే సరేనని ఒప్పుకునేదాన్ని అని తెలిపారు.
By: Srikanth Kontham | 17 Sept 2026 12:11 PM IST`రామ్ తేరీ గంగా మైలీ` చిత్రంతో బాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన సీనియర్ నటి మందాకిని కెరీర్ తొలి రోజులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన మందానికి తన నటనా ప్రస్తానంలో 16 నుండి 17 సినిమాలకు అసలు ఎలాంటి పారితోషికం దక్కలేదని వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆనాటి సినీ వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో షూటింగ్ సెట్‌లు చాలా ఆప్యాయంగా, సొంత ఇంటి వాతావరణాన్ని తలపించేవని మందాకిని తెలిపారు.
నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరూ కలిసి భోజనం చేసేవారని, ఎవరి గదికి వెళ్లాలన్నా ?ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావని పేర్కొన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్నంత ప్రొఫెషనలిజం లేకపోయినా? ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వం ఎక్కువగా ఉండేదన్నారు. అప్పట్లో సినిమాలు సంతకం చేయడం, రెమ్యూనరేషన్ లావాదేవీలు చాలా ఇన్ఫార్మల్ గా జరిగేవని మందాకిని వివరించారు. కాంట్రాక్టు పత్రాలు చాలా సరళంగా ఉండేవని.. కొందరు వచ్చి సినిమా సంతకం చేయండి, పారితోషికం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేవారని గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే కొందరు నిర్మాతలు వచ్చి 15 రోజుల పాటు మాత్రమే పనిచేయమని అడిగితే ఎలాంటి రుసుము ఆశించకుండా వెంటనే సరేనని ఒప్పుకునేదాన్ని అని తెలిపారు. అన్ని సినిమాలు చేసినా? 16 నుండి 17 చిత్రాలకు పారితోషికం ఎందుకు అందలేదో మందాకిని స్పష్టత ఇచ్చారు. అప్పట్లో కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం లేదా షూటింగ్ పూర్తయినా విడుదల కాకపోవడం వల్ల డబ్బులు వచ్చేవి కావన్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకే నిర్మాత వద్ద మూడు సినిమాలు చేస్తే.. ఒక సినిమా విడుదలై? మిగిలిన రెండు ఆగిపోవడం వల్ల చివరగా రావలసిన ఆఖరి విడత సొమ్ము బకాయిగానే మిగిలిపోయేదని వివరించారు.
అన్ని సినిమాలు చేసినా? అనేక ప్రాజెక్టులకు డబ్బులు దక్కకపోవడం బాధాకరమే అయినా? తాను చేసిన పనికి ఎంతో సంతృప్తి చెందానని మందాకిని పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోయినా దర్శకనిర్మాతలు , తోటి నటీనటులు ఎంతో మర్యాదగా, సహకారంతో మెలిగేవారన్నారు. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వల్లే తాము ఎలాంటి మనస్పర్థలు లేకుండా స్నేహపూర్వకంగా పనులు పూర్తి చేసేవాళ్లమని తెలిపారు.
ప్రస్తుత పరిశ్రమతో పోలిస్తే నాటి రోజులు ఎంతో భిన్నమైనవని మరోసారి ప్రూవ్ అయింది. నేటి కాలంలో పక్కా కాంట్రాక్టులు, కోట్ల రూపాయల పారితోషికాలు, లీగల్ అగ్రిమెంట్లు ఉన్నప్పటికీ, అప్పటి కాలంలో ఉన్న ఆత్మీయత, మైత్రి లోపించాయని మందాకిని వ్యాఖ్యలతో వ్యక్తమవుతోంది. ఒకవైపు పారితోషిక పరంగా నష్టం జరిగినట్లు అనిపించినా? మరోవైపు ఆ జ్ఞాపకాలను మందాకిని ఎంతో మధురంగా భావించడం గొప్ప విషయం.
