Begin typing your search above and press return to search.

కన్నప్ప తర్వాత రూ.100కోట్ల పెట్టుబడి పెట్టిన విష్ణు.. ఎక్కడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు రీసెంట్ గా కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   21 Aug 2025 9:04 PM IST
కన్నప్ప తర్వాత రూ.100కోట్ల పెట్టుబడి పెట్టిన విష్ణు.. ఎక్కడంటే?
X

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు రీసెంట్ గా కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మైథలాజికల్ కథతో తెరకెక్కిన మూవీకి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.

ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప మూవీ.. విమర్శకులను కూడా మెప్పించింది. అయితే ఆ సినిమా తర్వాత మరో మూవీని అనౌన్స్ చేయలేదు. కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో వర్క్ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో ఇప్పుడు విష్ణు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోడ్రామాల్లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టారు. అది వినోద రంగం భవిష్యత్తు కోసం కీలక అడుగుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్ ఛేంజింగ్ వ్యవస్థాపకుడిగా విష్ణు దృష్టిని స్థిర పరుస్తుందని అంటున్నాయి.

2025లో మోస్ట్ టాక్డ్ ఫెర్ఫార్మెన్స్ ఆయనేదని అంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ వారి కోసం ఆలోచించి కన్నప్ప మూవీ తీశారని కొనియాడారు. ఇప్పుడు డబుల్ మైల్ స్టోన్ కు చేరుకున్నారని చెబుతున్నారు. బిజినెస్ మాస్టర్ స్ట్రోక్ గా వర్ణిస్తున్నారు. అయితే విష్ణు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిన తర్వాత వాటి కోసం అంతా మాట్లాడుకుంటున్నారు.

మైక్రోడ్రామాలు అంటే ఏమిటి?

అవి చిన్న, సినిమాటిక్ ఎపిసోడ్‌ లు. ఒక్కొక్కటి 3–7 నిమిషాలతో ఉంటుంది. మొబైల్ ప్రేక్షకుల కోసం రూపొందుతాయి. మంచి విజువల్స్, గ్రిప్పింగ్ స్టోరీస్ తో రెడీ అవుతాయి. భావోద్వేగపరంగా పట్టున్న కథలతో సినిమా ఎంటర్టైన్మెంట్ ను కొన్ని నిమిషాల్లోనే ఆడియన్స్ ను అందిస్తాయి.

అయితే సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, ఈ మైక్రోస్టోరీలు పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, స్టోరీ వాల్యూతో రెడీ అవుతాయి. అదే సమయంలో విష్ణు తన తదుపరి ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అవన్నీ ఖరారు అయ్యే దశలో ఉన్నట్లు వినికిడి. త్వరలో వాటిని అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి చూడాలి విష్ణు కొత్త ప్రాెజెక్టుల ప్రకటన ఎప్పుడు వస్తుందో..