మరోసారి 'కన్నప్ప' సందడి.. స్పెషల్ ఏంటంటే?
గత ఏడాది విడుదలై డివోషన్, ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.
By: M Prashanth | 17 Jun 2026 7:45 PM ISTటాలీవుడ్ స్టార్ మంచు విష్ణు కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన కన్నప్ప మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత ఏడాది విడుదలై డివోషన్, ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ 27న సెలెక్ట్ చేసిన థియేటర్లలో కన్నప్పను మళ్లీ సందడి చేయనుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. పోస్టర్ లో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న కన్నప్ప పాత్రలో మంచు విష్ణు కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. పచ్చని కొండలు, ప్రకృతి అందాల మధ్య రూపొందించిన ఆ పోస్టర్ సినిమాలోని డివోషనల్ ఎలిమెంట్స్ ను రిఫ్లైక్ట్ చేసేలా ఉందని సినీ ప్రియులు చెబుతున్నారు.
అయితే మైథలాజికల్ స్టోరీ లైన్ ఆధారంగా చేసుకుని తెరకెక్కిన కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డా. మోహన్ బాబు ఆ చిత్రాన్ని నిర్మించారు. భారీ స్థాయిలో రూపొందిన ఆ సినిమాలో మంచు విష్ణుతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న క్యాస్టింగ్ సినిమాపై విడుదలకు ముందే భారీ ఆసక్తిని పెంచింది.
సినిమా రిలీజ్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాల్లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్ ప్రధానంగా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో కన్నప్ప పాత్రలో విష్ణు యాక్టింగ్ కు మంచి ప్రశంసలు లభించాయి. భక్తి నేపథ్యంలో సాగే కథకు ఎమోషన్స్ యాడ్ చేసి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే థియేటర్లలో మంచి రెస్పాన్స్ తో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కూడా సినిమా మెప్పించింది.
ఇటీవల కాలంలో రీరిలీజ్ ట్రెండ్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. గతంలో హిట్ అయిన సినిమాలను కొత్త జెనరేషన్ ఆడియన్స్ కోసం మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అలాంటి లిస్ట్ లోకి ఇప్పుడు కన్నప్ప కూడా చేరింది. అయితే సాధారణ రీరిలీజ్ లతో పోలిస్తే ఆ సినిమాకు ఉన్న స్పెషల్ మైథాలాజికల్ ఎలిమెంట్సే. సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిన విజువల్ ఎక్స్పీరియన్స్ ను మరోసారి ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేయడం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే చిత్రాన్ని థియేటర్లలో చూసినవారు మరోసారి ఎక్స్పీరియన్స్ చేసేందుకు సిద్ధమవుతుండగా, అప్పట్లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మంచి ఛాన్స్ కానుంది. డివోషనల్, ఎమోషన్స్, యాక్షన్, మైథాలజీ ఎలిమెంట్స్ తో రూపొందిన కన్నప్ప మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినీ అభిమానుల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. మొదటిసారి రిలీజైనప్పుడు వచ్చిన రెస్పాన్స్ రీరిలీజ్ లోనూ వస్తుందా? మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను మూవీ ఆకట్టుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
