మనోజ్ డేవిడ్ రెడ్డి సినిమాలో కనిపించనున్న ఇద్దరు స్టార్ హీరోలు...!
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న డేవిడ్ రెడ్డి సినిమా ఇప్పటికే దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడటానికి.. ప్రధాన కారణం ఈ సినిమా కాస్టింగ్ అప్‌డేట్స్.
By: Priya Chowdhary Nuthalapti | 17 Dec 2025 12:09 PM ISTఈ మధ్యనే మిరాయి చిత్రంతో.. తనేంటో మరోసారి రుజువు చేసుకున్నారు.. మంచు మనోజ్. దొంగ దొంగది సినిమాతో హీరోగా అడుగుపెట్టిన ఈ మంచు వారసుడు.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో.. నెగిటివ్ పాత్రలవైపు కూడా మగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే మిరాయి చిత్రంలో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు.
ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోనే.. హీరోగా డేవిడ్ రెడ్డి.. అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న డేవిడ్ రెడ్డి సినిమా ఇప్పటికే దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడటానికి.. ప్రధాన కారణం ఈ సినిమా కాస్టింగ్ అప్‌డేట్స్.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రల కోసం ఇద్దరు సూపర్ స్టార్స్ ని సంప్రదించారంట. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర కోసం అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్రపై రామ్ చరణ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
మరోవైపు.. కోలీవుడ్ స్టార్ సింబు..ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మనోజ్ కి సింబు మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మనోజ్ అడగగానే ఈ హీరో ఒప్పుకున్నారు అని వినికిడి. ఇక ఈ ముగ్గురు హీరోలు కలిసి కనిపిస్తే ఈ సినిమాకి క్రేజ్ మరింత రెట్టింపు అవ్వడం ఖాయం.
ఇక ఈ సినిమాలో మనోజ్.. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యమైన తిరుగుబాటు వీరుడిగా కనిపిస్తారు అని తెలుస్తోంది. బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసే పాత్ర ఇది అని కూడా సమాచారం.
ఈ సినిమా కథ 1897 నుంచి 1922 మధ్య కాలాన్ని నేపథ్యంగా తీసుకుని సాగుతుంది. ఆ కాలంలో జరిగిన పోరాటాలు, త్యాగాలు, భావోద్వేగాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలపై ఈ సినిమా కథ నడుస్తుందంట. ఈ చిత్రానికి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి.. ఈ సినిమాను వెల్వెట్ సౌల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన.. టైటిల్ పోస్టర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. మనోజ్ ముఖాకారంలో టైటిల్ డిజైన్ చేయడం అందరిని ఆకట్టుకుంది. “మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించి, ఢిల్లీలో పెరిగి, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేస్తున్నాడు” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మరి ఈ సినిమా ఈ హీరోకి ఎలాంటి ఫలితం ఇస్తుందో.. వేచి చూడాలి.
