Begin typing your search above and press return to search.

'అఖండ 2'.. ముందు 'ఆది' అనుకోలేదా?

నిజానికి సినిమాలో విలన్ క్యారెక్టర్లు కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ తాంత్రికుడిగా నటించిన ఆది పినిశెట్టి.. అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి.

By:  M Prashanth   |   13 Dec 2025 6:03 PM IST
అఖండ 2.. ముందు ఆది అనుకోలేదా?
X

వాయిదాలు దాటుకుని.. అడ్డంకులు ఎదుర్కొని.. ఎట్టకేలకు అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మంచి వసూళ్లు రెస్పాన్స్ అందుకుంటుందని మేకర్స్ ఇటీవల వెల్లడించారు.

అయితే సినిమాలో బాలయ్య యాక్టింగ్ తో అదరగొట్టేశారని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కొనియాడుతున్నారు. ఆయనతోపాటు కీలక పాత్రలు పోషించిన పలువురు నటీనటులు కూడా ప్రశంసలను అందుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మూవీలో విలన్ గా కనిపించిన ఆది పినిశెట్టి పేరు వినిపిస్తోంది.

నిజానికి సినిమాలో విలన్ క్యారెక్టర్లు కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ తాంత్రికుడిగా నటించిన ఆది పినిశెట్టి.. అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి. లుక్ తోపాటు స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో తన యాక్టింగ్ తో అలరించారు. నేచురల్ గా యాక్ట్ చేసి తన టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

అయితే తాంత్రికుడి రోల్ కోసం ముందు ఆది పినిశెట్టిని మేకర్స్ అనుకోలేదని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆది కన్నా ముందు పలువురు హీరోలను సంప్రదించగా.. ఎవరూ ఓకే చెప్పలేదట. అందులో హీరో మంచు మనోజ్ పేరు ఉండడం గమనార్హం. ఆయనకు కాంటాక్ట్ చేసి స్టోరీని మేకర్స్ చెప్పారని సమాచారం.

కథ మొత్తం విన్నాక.. తనకు నచ్చిందని మనోజ్ చెప్పారని తెలుస్తోంది. కానీ అప్పటికే తన లైనప్ లో పలు ప్రాజెక్టులు ఉండడంతో.. నటించలేనని చెప్పేశారట. ఆ తర్వాత మరికొందరు హీరోలను కూడా సంప్రదించగా.. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో ఓకే చెప్పలేదని టాక్. అనంతరం ఆది పినిశెట్టిని సెలెక్ట్ చేసినట్టు వినికిడి.

దీంతో ఇప్పుడు మంచు మనోజ్ మంచి ఛాన్స్ మిస్ అయిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆది పినిశెట్టి లాగానే మనోజ్ కూడా అదరగొట్టేవారని అంటున్నారు. ఏ రోల్ ఎవరికి రాసి ఉందో వాళ్లకే దక్కుతుందని అంటున్నారు. అయితే రీసెంట్ గా మిరాయ్ మూవీలో మంచు మనోజ్ విలన్ గా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనదైన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. కానీ ఇప్పుడు అఖండ 2 ఛాన్స్ మాత్రం మిస్ అయ్యారు!