Begin typing your search above and press return to search.

రూత్ లెస్ డేవిడ్ రెడ్డి.. క్యా లుక్ హై మనోజ్!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కెరీర్‌ లోనే హై ఇంటెన్స్ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న చిత్రం డేవిడ్ రెడ్డి.

By:  M Prashanth   |   26 Jan 2026 11:41 PM IST
రూత్ లెస్ డేవిడ్ రెడ్డి.. క్యా లుక్ హై మనోజ్!
X

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కెరీర్‌ లోనే హై ఇంటెన్స్ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న చిత్రం డేవిడ్ రెడ్డి. బ్రిటీష్ పాలన నేపథ్యంతో రూపొందుతున్న ఆ భారీ పాన్ ఇండియా సినిమాను వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి నిర్మిస్తుండగా, హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ తోనే సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగాయి.

ఫస్ట్ లుక్‌ లో మంచు మనోజ్ పూర్తిగా భిన్నంగా కనిపించారు. చేతిలో ఆయుధం, కళ్లలో ప్రతీకారం, ముఖంలో క్రూరత్వం… యుద్ధభూమి నేపథ్యంతో కనిపించిన ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ లుక్‌ ను షేర్ చేస్తూ మనోజ్ .. "ఇది నాలో ఇప్పటివరకు బయటకు రాని కొత్త వైపు. ఎలాంటి కరుణ లేని పాత్ర" అంటూ ఇంట్రెస్టింగ్ రైటప్ ఇచ్చారు.

తాజా మారో లుక్ ను షేర్ చేశారు మనోజ్. దయ లేదు.. వెనక్కి తిరగడం లేదు.. డేవిడ్‌ రెడ్డి ఎరా ప్రారంభం అంటూ రాసుకొచ్చారు. కొత్త లుక్ లో మనోజ్ ఓ రేంజ్ లో ఉన్నారు. భారీ బైక్ పై ఆయుధంతో యుద్ధం చేస్తూ వెళ్తున్నట్లు కనిపించారు. మొత్తం రోడ్ అంతా రక్తంతో నిండిపోయి కనిపించింది. దీంతో కొత్త లుక్ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

అయితే డేవిడ్ రెడ్డి సినిమా కథ 1897 నుంచి 1922 మధ్య బ్రిటీష్ పాలన కాలంలో జరుగుతుంది. చరిత్ర పుస్తకాల్లో కనిపించని కొన్ని సంఘటనలు, అణచివేతలు, హింసాత్మక పరిణామాల మధ్య ఒక వ్యక్తి ఎలా ఎదిరించి నిలబడ్డాడు అన్నదే డేవిడ్ రెడ్డి కథాంశం. స్వాతంత్ర్యం అడిగి కాదు… పోరాడి తెచ్చుకోవాలనే సిద్ధాంతంతో ముందుకు సాగే యోధుడిగా మంచు మనోజ్ కనిపించనున్నారు. దాదాపు 700 కేజీల బరువు ఉన్న భారీ బైక్ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇక సినిమా విషయానికొస్తే.. రష్యన్ నటి మారియా ర్యబోషప్క హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ప్రముఖ నటులు పార్తీబన్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు పని చేస్తున్నట్లు సమాచారం. బైరవం, మిరాయ్ వంటి చిత్రాలతో మళ్లీ ఫుల్ ఫామ్‌ లోకి వచ్చిన మంచు మనోజ్… ఇప్పుడు కెరీర్‌ లోనే మోస్ట్ వైలెంట్, మోస్ట్ ఇంటెన్స్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డేవిడ్ రెడ్డి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. మొత్తానికి… ఫస్ట్ లుక్‌ తోనే సంచలనం సృష్టించిన ఆ మూవీ… బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి నిలిచిన ఓ రెబల్ యోధుడి కథగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి డేవిడ్ రెడ్డి థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.