అప్పుడు మనోజ్ మూవీలో బాలయ్య కేమియో.. ఇప్పుడు దాదా మూవీ కలిసొచ్చేనా?
ఇదిలా ఉండగా ఈ సినిమాలో గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.
By: Madhu Reddy | 7 Sept 2026 9:18 PM ISTనటసింహ నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసు దాటినా.. ఎటువంటి డూప్ లేకుండా.. బాడీ డబుల్స్ ఉపయోగించకుండా వరుస యాక్షన్ చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి చేస్తున్న చిత్రం ఎన్.బి.కె111. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి గాడ్ లేదా దాదా అనే పేర్లు పరిశీలనలో ఉండగా.. ఎట్టకేలకు దాదా అనే పేరుతో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇటీవల అధికారిక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి, సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.
ఎట్టకేలకు ఈ విషయంపై మంచు మనోజ్ స్వయంగా స్పందించి, ఊహించని బజ్ క్రియేట్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో వచ్చిన సర్దార్ మూవీకి కొనసాగింపుగా.. సర్దార్ 2 సెప్టెంబర్ 10వ తేదీన ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న ఎస్ జె సూర్యాతో పాటు సినిమా హీరో కార్తీ వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరిని మంచు మనోజ్ సరదాగా ఇంటర్వ్యూ చేశారు. అందులో ఎన్నో విషయాలు పంచుకోగా.. అటు మంచు మనోజ్ కూడా ప్రస్తుతం బాలకృష్ణ దాదా సినిమాలో నటిస్తున్నాను అంటూ అఫీషియల్ గా చెప్పేశారు.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాత విషయాలను నెటిజన్స్ బయటకు తీస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో మంచు లక్ష్మి , మంచు మనోజ్ కలయికలో వచ్చిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాలో బాలకృష్ణ రుద్రమనేని నరసింహ రాయుడు అనే పాత్ర పోషించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. మంచు లక్ష్మీ నిర్మాణంలో శేఖర్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకుంది. అలా మంచు మనోజ్ సినిమాలో బాలకృష్ణ కీలకపాత్ర పోషించినప్పటికీ ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది.
అలాంటిది ఇప్పుడు ఏకంగా బాలకృష్ణనే ఢీ కొట్టడానికి మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. మరి ఈ దాదా సినిమా వీళ్ళకు కలిసొస్తుందా? అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే మంచు మనోజ్ సినిమాలో బాలయ్య నటించినా.. ఇప్పుడు బాలయ్యకే దీటుగా బాలయ్య సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అప్పుడు మిశ్రమ స్పందన లభించింది మరి ఇప్పుడు రాబోతున్న ఈ దాదా సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఎందుకంటే ఇటీవలే మిరాయ్ సినిమాలో విలన్ పాత్ర పోషించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు మంచు మనోజ్ . తన నటనలో ఊహించని మార్పు వచ్చింది. అందుకే ఈ సినిమాతో మరో ఫీట్ అందుకోవడం ఖాయం అనే కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. మరి క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
