'అత్తరు సాయిబు'గా మంచు వారసుడు!
ఏడేళ్ల తర్వాత మంచు వారసుడు మనోజ్ కెరీర్ మళ్లీ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతుంది. వ్యక్తిగత కారణా లుగా ఇంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ మళ్లీ గత వైభవాన్ని అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
By: Srikanth Kontham | 5 Sept 2025 1:00 PM ISTఏడేళ్ల తర్వాత మంచు వారసుడు మనోజ్ కెరీర్ మళ్లీ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతుంది. వ్యక్తిగత కారణా లుగా ఇంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ మళ్లీ గత వైభవాన్ని అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే `భైరవం` సినిమాతో కంబ్యాక్ అయ్యాడు. ఫలితం సంగతి పక్కన బెడితే? మంచు వారబ్బాయి మళ్లీ వచ్చాడు? అన్న ఆనందాన్ని ఇండస్ట్రీకి కలిగించాడు. త్వరలో `మిరాయ్` అనే పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి రెడీ అవుతుతున్నాడు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రంలో మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు.
మంచి కంబ్యాక్ చిత్రంగా:
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి మనోజ్ కూడా మంచి కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాడు. ఈ విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మళ్లీ తలలో నాలుకలా మారుతాడని భావిస్తున్నాడు. అలాగే తానే హీరోగా `వాట్ ది ఫిష్` అనే మరో చిత్రం కూడా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ డిలే కారణంగా ఇంకా సెట్స్ లోనే ఉంది. ఏదీ ఏమైనా ఏడాది ముగింపుకల్లా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
క్యాచీ టైటిల్ తో క్రేజీగా:
ఈ రెండు గాక `డేవిడ్ రెడ్డి`, `రక్షక్` అనే మరో రెండు చిత్రాలు కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు `అత్తరు సాయిబు` అనే మరో చిత్రం కూడా రెడీ అవుతుందని తాజాగా మనోజ్ తెలిపాడు. `అత్తరు సాయిబు` అన్నది క్యాచీ టైటిల్. తెలుగింట ఈ పేరు ఎంతో ఫేమస్. `అత్తరు సాయిబు` పాట ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఆ పాట చాలా చోట్ల మార్మోమ్రోగుతూనే ఉంటుంది. సరిగ్గా ఆ ఫేమస్ సాంగ్ నే మనోజ్ తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేయడం విశేషం. ఇలాంటి టైటిల్ తో సినిమా జనాల్లోకి సులభంగా వెళ్తుంది.
అభిమానుల ఆకాంక్ష:
మనోజ్ సీరియస్ యాక్షన్ పాత్రలే కాదు మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు కూడా. ఈ నేపథ్యంలో `అత్తరు సాయిబు` టైటిల్ తో ఓ హాస్యాస్పద చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. స్టోరీ లాక్ అయింది. కానీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? తదితర వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. మొత్తానికి 2025 లో మంచు వారసుడు సినిమాల జోరు షురూ చేసినట్లే.
'రాజు భాయ్' నుంచి 'ఒక్కడు మిగిలాడు' వరకూ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాతే మరో రెండు చితరాలు చేసి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కంబ్యాక్ తో మనోజ్ మళ్లీ బిజీ అవ్వాలని అభిమానులు ఆశీస్తున్నారు.
