మంచు మనోజ్ సందడి మొదలైంది..!
మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ సినిమాలతో సందడి చేస్తున్నాడు. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మనోజ్ అప్పట్లో తన సినిమాలతో అలరించాడు.
By: Ramesh Boddu | 2 Sept 2025 4:00 PM ISTమంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ సినిమాలతో సందడి చేస్తున్నాడు. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మనోజ్ అప్పట్లో తన సినిమాలతో అలరించాడు. వెరైటీ సినిమాలు చేసి యాక్షన్ ప్రియులను అలరించాడు. అంతేకాదు తన యాక్షన్ కొరియోగ్రఫీ తానే కంపోజ్ చేసుకుని సర్ ప్రైజ్ చేశాడు. మంచు మనోజ్ టాలెంట్ ని ఆడియన్స్ గుర్తించారు. ఐతే మధ్యలో ఏమైందో ఏమో కానీ మంచు మనోజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. అందుకే కొంత గ్యాప్ ఇచ్చాడు మనోజ్.
ఆఫ్టర్ లాంగ్ టైం మనోజ్..
ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ మంచు మనోజ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ రీసెంట్ గా భైరవం సినిమాలో నటించిన మనోజ్ లేటెస్ట్ గా మిరాయ్ అనే సినిమాతో వస్తున్నాడు. మిరాయ్ సినిమాలో తేజ సజ్జ లీడ్ రోల్ లో నటిస్తుంటే మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. మిరాయ్ లో హీరోకి ఈక్వల్ రేంజ్ లో ఇంకా ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టి చూస్తే మంచు మనోజ్ కే ఎక్కువ ఎలివేషన్ ఉన్నట్టు ఉంది.
భైరవం కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ మనోజ్ ని మళ్లీ వార్తల్లో నిలిచేలా చేసింది. ఇక నెక్స్ట్ మిరాయ్ సినిమా చూస్తుంటే కమర్షియల్ గా కూడా అదరగొట్టేలా ఉంది. హనుమాన్ తర్వాత తేజా సజ్జ చేస్తున్న సినిమా కాబట్టి ఈ మిరాయ్ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిన మంచు మనోజ్ కి కూడా నేషనల్ వైడ్ ఫాలోయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది.
కెరీర్ మీదే ఫోకస్..
సినిమాలే కాదు వాటి ప్రమోషన్స్, ఈవెంట్స్, స్పెషల్ చిట్ చాట్స్ ఇలా మళ్లీ మంచు మనోజ్ తన కెరీర్ మీదే ఫోకస్ పెట్టినట్టు ఉన్నాడు. ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్న మంచు మనోజ్ ని చూసి ఆడియన్స్ కూడా ఖుషి అవుతున్నారు. సో మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ తప్పకుండా అతనికి మంచి హైప్ తెచ్చేలా ఉంది. మనోజ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు అతనికి మంచి లిఫ్ట్ ఇస్తాయేమో చూడాలి.
మంచు మనోజ్ ఏ ఈవెంట్ లో కనిపించినా కూడా అక్కడ సరదా సరదాగా తన కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. జస్ట్ సినిమాల పరంగా గ్యాప్ తీసుకున్నాడు కానీ మనోజ్ లో ఆ ఎనర్జీ మాత్రం అలానే ఉంది. ఇక భైరవం, మిరాయ్ ల తర్వాత మంచు మనోజ్ సోలో సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా హిట్ పడితే మళ్లీ లీగ్ లోకి మంచు హీరో వచ్చేసినట్టే. మంచు మనోజ్ మిరాయ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా హిట్ పడితే మనోజ్ కి నెగిటివ్ రోల్స్ కూడా మరిన్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది.
