సూపర్ స్టార్ విడాకులు.. మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు..
పూర్తిగా స్వేచ్ఛగా ఉందని, నచ్చేలా బతకాలని చెప్పాల్సింది పోయి.. హద్దులు గీస్తున్నారని మంచు లక్ష్మి అన్నారు. ఆడవారిని ఇలాంటి క్వశ్చన్లు అడిగితే.. మీరు వారిని ఆపుతున్నారనే అర్థం వస్తుందని తెలిపారు.
By: M Prashanth | 17 Sept 2025 10:20 PM ISTనటి మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. ఆమె కామెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆమె.. దక్ష: ఏ డెడ్లీ కాన్‌స్పిరసీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 19వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు మంచు లక్ష్మి చిర్రెత్తిపోయారు. ముంబై వెళ్లిన తర్వాత మీ డ్రెస్సింగ్ మారిపోయిందని, చిన్న చిన్న బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనాలు ఏమనుకుంటారని ప్రశ్నించగా.. మంచు లక్ష్మి అసహనానికి గురైనట్లు కనిపించారు. కాస్త స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చారు.
"ఇదే క్వశ్చన్ ను మీరు మగవాడిని అడుగుతారా?.. మహేష్ బాబు మీకు 50 ఏళ్లు వచ్చాయి.. షర్ట్ ఇప్పుకుని తిరుగుతున్నావ్ అని అడుగుతారా.. అలాంటిది ఒక ఆడపిల్లను ఎలా అడుగుతారు.. మీరు అడిగే ప్రశ్నలనే చూసి జనాలు నేర్చుకుంటారు.. మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి" అని మంచు లక్ష్మి తెలిపారు.
పూర్తిగా స్వేచ్ఛగా ఉందని, నచ్చేలా బతకాలని చెప్పాల్సింది పోయి.. హద్దులు గీస్తున్నారని మంచు లక్ష్మి అన్నారు. ఆడవారిని ఇలాంటి క్వశ్చన్లు అడిగితే.. మీరు వారిని ఆపుతున్నారనే అర్థం వస్తుందని తెలిపారు. ఓ సూపర్ స్టార్ భార్య ఇక్కడే వర్క్ చేస్తున్నారని, విడాకులు తీసుకున్నాక సినిమాలు చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
ఒక వేళ ఆమెతో మూవీ తీయాలన్నా.. ఆమె భర్త వాళ్లు ఏమంటారోని కొందరు భయపడుతున్నారని ఆరోపించారు. అయితే అది ఎవరో పేరు చెప్పక్కర్లేదని అన్నారు. ఇంతలో హోస్ట్.. సామ్ అని అన్నారు. దీంతో "సమంత అని మీరు అనుకుంటున్నారు. సూపర్ స్టార్ ఒకరు కాదండీ. ఐదారుగురికి డోవర్సులు అయ్యాయి. అందరితో క్లోజ్ గా ఉంటాను" అని తెలిపారు.
"అయితే చాలా మంది నటీమణులు, తమ పిల్లలు పెద్దోళ్లు అయ్యాక సినిమాలు చేస్తామంటున్నారు. అదే మాట మగవారు మాత్రం ఎప్పుడూ చెప్పరు. పిల్లలను చూసుకోవాలి. డివోర్స్ అయింది. దాని తర్వాత సినిమాల్లోకి వెళ్లానని అనరు. ఒక మగవాడి జీవితం ఏ మార్పు లేకుండా సాగుతుంది. కానీ, ఆడవారికి అలా కాదు" అని చెప్పారు.
"పెళ్లి అయ్యాక, తల్లి అయ్యాక, పిల్లలు పుట్టిన తర్వాత అత్త మామ గార్ల సహా అనేక బాధ్యతలు ఉంటాయి. వాటన్నింటి బాధ్యత మాపైనే ఉంటుంది. అందుకే స్వేచ్ఛ ఎవరూ ఇవ్వరు. దాన్నీ మేమే స్వయంగా వెతుక్కోవాలి" అని లక్ష్మి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
