రకుల్-లక్ష్మీ-ప్రగ్య: మాల్దీవ్స్‌కి మెంటలెక్కించిన దోస్తానాలు
అయితే స్నేహితులు ఎందరైనా ఉండొచ్చు.. కానీ ముంబైలో లక్ష్మీ మంచుకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే రెండు పేర్లు ఠకీమని గుర్తుకు వస్తాయి. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైశ్వాల్... ఈ ఇద్దరు అందాల భామలతో లక్ష్మీ మంచు స్నేహం ఎల్లపుడూ చర్చనీయాంశమే.
By: Sivaji Kontham | 29 Nov 2025 7:58 PM ISTమంచు లక్ష్మీ స్నేహాలు హైదరాబాద్ టు ముంబై, ముంబై టు చెన్నై విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. మూడు మెట్రో నగరాలలో తనకు స్నేహితులు ఉన్నారు. అందరూ టాప్ సెలబ్రిటీలే. ఇటీవలి కాలంలో ముంబైలోనే తన సమయాన్ని ఎక్కువగా గడిపేందుకు ఆసక్తిగా ఉన్నారు లక్ష్మీ ప్రసన్న. అక్కడ సెలబ్రిటీ ప్రపంచంలో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే స్నేహితులు ఎందరైనా ఉండొచ్చు.. కానీ ముంబైలో లక్ష్మీ మంచుకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే రెండు పేర్లు ఠకీమని గుర్తుకు వస్తాయి. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైశ్వాల్... ఈ ఇద్దరు అందాల భామలతో లక్ష్మీ మంచు స్నేహం ఎల్లపుడూ చర్చనీయాంశమే. వారంతా ఒక కుటుంబంలా కలిసిపోతారు.
పార్టీలకు వెళ్లినా, వెకేషన్స్ కి వెళ్లినా కలిసే వెళ్లడం దోస్తానాలకు అలవాటు. ఇప్పుడు ముగ్గురు మిత్రులు మాల్దీవుల వెకేషన్ లో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈసారి రకుల్ ప్రీత్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి మాల్దీవుల విహారాన్ని ఆస్వాధిస్తుండగా, ప్రగ్య జైశ్వాల్ తన బంధువులతో కలిసి వీళ్లతో చేరింది. ఇక మంచు లక్ష్మి.. తన కిడ్స్ విద్యా నిర్వాణ, ఆనంద్ మంచుతో కలిసి టీమ్ లో చేరింది. ఓవరాల్ గా మూడు కుటుంబాలు మాల్దీవుల విహారాన్ని ఎంతో ప్లెజెంట్ గా ఆస్వాధిస్తున్నాయి.
ఆ ముగ్గురి కుటుంబాలు మాల్దీవుల్లోని సీప్లేన్ టెర్మినల్ వద్ద గ్రూపుగా కలిసి నిలబడి కనిపించారు. అందరూ సౌకర్యవంతమైన వేకే దుస్తులను ధరించి.. హాయిగా చిరునవ్వులు చిందిస్తూ, మనస్ఫూర్తిగా వాతావరణాన్ని ఆస్వాధిస్తూ కనిపించారు. వారితో సన్ గ్లాసెస్, ట్రావెల్ బ్యాగులు ట్రావెలింగ్ వైబ్స్ ని తెచ్చాయి. చివరకు ఎస్కేప్ అయ్యాం! అంటూ వారంతా సరదాగా చిల్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో గుబులు రేపుతున్నాయి.
మంచు లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ ఈ సమూహంలో చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. పిల్లలతో కలిసి అడల్ట్ బ్యాచీ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. జాకీ, లక్ష్మీ, లక్ష్మీ కుమార్తె విద్యా, ప్రగ్యా జైస్వాల్ ఇతర స్నేహితుల బృందం ఓ చోట చేరి రచ్చ రచ్చ చేస్తోంది. రకుల్ ఓ వైపు `దేదే ప్యార్ దే 2` సక్సెస్ సెలబ్రేషన్ ని ఆస్వాధిస్తూనే, ఇప్పుడిలా వెకేషన్ ని ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈరోజుల్లో మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు కరువయ్యాయి. అందుకే ఇప్పుడు వీరంతా ఇలా ఒక కుటుంబంలా కలిసిపోయి ఆస్వాధిస్తున్న తీరు వీక్షకుల కళ్లలో హాయిని నింపుతోంది.
