Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి.. ఫైర్ అంటే అది!

నటి మంచు లక్ష్మి.. ఓ వ్యక్తిపై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వెనుక నుంచి తనపై అసభ్యకరంగా కామెంట్ చేయగా.. లక్ష్మి ఇచ్చి పడేశారు

By:  M Prashanth   |   9 Sept 2025 7:31 PM IST
మంచు లక్ష్మి.. ఫైర్ అంటే అది!
X

నటి మంచు లక్ష్మి.. ఓ వ్యక్తిపై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వెనుక నుంచి తనపై అసభ్యకరంగా కామెంట్ చేయగా.. లక్ష్మి ఇచ్చి పడేశారు. దమ్ముంటే తన ఎదురుగా నిల్చుని మాట్లాడమని ఛాలెంజ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

దుబాయ్ లో ఇటీవల సైమా అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు ఆ ఫంక్షన్ కు హాజరవ్వగా.. మంచు లక్ష్మి కూడా వచ్చారు. ఆ సమయంలో వారందరినీ చూసేందుకు సినీ ప్రియులు, అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు కూడా తెగ పోటీ పడ్డారు.

అప్పుడు మంచు లక్ష్మి తన అభిమానులను నిరాశ పరచకుండా.. వారితో సెల్ఫీలు దిగేందుకు ముందుకొచ్చారు. ఆ సమయంలో ఆమె వెనకవైపు నిలబడి ఉన్న ఎవరో వ్య‌క్తి అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీంతో మంచు లక్ష్మి క్షణాల్లోనే ఆగ్రహంతో రెస్పాండ్ అయ్యారు. ఒరేయ్ అంటూ అరుస్తూ.. దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడురా అని అన్నారు.

టైమ్, సెన్స్ ఏమీ లేదు రాస్కెల్స్ అంటూ మంచు డాటర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు మంచు లక్ష్మికి సోషల్ మీడియోలో మద్దతు వెల్లువెత్తుతోంది. ఇలాంటి అసభ్యక‌ర‌ కామెంట్లను ఇప్పటికైనా మానుకోవాలంటూ కొందరు నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. సరైన రీతిలో రెస్పాండ్ అయ్యారని చెబుతున్నారు.

అయితే ఆ ఘటన తర్వాత కూడా మంచు లక్ష్మి మామూలు మూడ్ లోకి వచ్చి అభిమానులతో సెల్ఫీలు తీసుకున్నారు. సెల్ఫీ ప్లీజ్ అక్కా అంటూ అడిగిన వారికి ఆప్యాయతతో రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ముంబైలో కూడా తెలుగు ఫోటోగ్రాఫర్లు తనను అక్కా అని పిలుస్తాంటరని తెలిపారు. ఓ చిన్నారితో మాట్లాడి మరీ పేరు తెలుసుకున్నారు.

ఇక ల‌క్ష్మి కెరీర్ విష‌యానికి వ‌స్తే.. గత ఏడాది ఆదిపర్వం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జియో హాట్‌స్టార్ సిరీస్ యక్షణిలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ అనే మూవీలో నటిస్తున్నారు. తన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.