Begin typing your search above and press return to search.

ఈడీ విచారణకు మంచు లక్ష్మీ.. అలా రావాలంటూ షరతు!

గత కొన్ని రోజులుగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేస్ తో పాటు బెట్టింగ్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలను విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   13 Aug 2025 9:54 AM IST
ఈడీ విచారణకు మంచు లక్ష్మీ.. అలా రావాలంటూ షరతు!
X

గత కొన్ని రోజులుగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేస్ తో పాటు బెట్టింగ్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలను విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ , రానా దగ్గుపాటి వంటి సెలబ్రిటీలను విచారించిన అధికారులు.. మంచు లక్ష్మిని ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలని పిలుపునిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈడీ అధికారుల ముందుకు మంచు లక్ష్మి హాజరు కాబోతున్నారు.

ఇకపోతే 11 గంటలకు ఈడీ కార్యాలయం ముందు హాజరు కాబోతున్న మంచు లక్ష్మికి .. ఏకాంతంగా.. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించకుండా రావాలి అని చెప్పినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఇదిలా ఉండగా మరొకవైపు మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ లకు సంబంధించి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది..? వాటి లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను కూడా తీసుకురావాలి అని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇకపోతే అధికారుల ముందు ఈరోజు ఉదయం 11 గంటలకు మంచు లక్ష్మీ హాజరు కాబోతున్నారు. మరి అక్కడ ఈమె ఎలాంటి ప్రశ్నలు ఈడి అధికారుల నుండి ఎదుర్కోబోతోంది? ఏ విధంగా సమాధానం చెప్పనుంది ? అనే విషయాలు ఉత్కంఠగా మారాయి.

ఇదిలా ఉండగా ఈ బెట్టింగ్ యాప్ లు ప్రజల జీవితాలతో ఏ రేంజ్ లో ఆడుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఉంటే చాలు సెలబ్రిటీలు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి, ఆఖరికి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న యువత కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక మృతుల సంఖ్య రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో బాధితుల కుటుంబాల పరిస్థితి మరింత అద్వానంగా మారింది. బెట్టింగ్ భూతంలో ఇరుక్కొని తల్లిదండ్రులను కోల్పోతున్న పిల్లలు ఉన్నారు.. పిల్లల్ని కోల్పోతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన అధికారులు ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ను ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో.. వారందరినీ విచారించి, ఇకపై ఇలాంటివి చేయకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి .

అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో వీరందరిపై కేసు నమోదు అవ్వగా.. ఈ కేసు నిమిత్తం ఈడి అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. అలాగే 19 బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా కేసు నమోదు చేశారు. త్వరలోనే బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా పారద్రోలి , యువత భవిష్యత్తును బంగారుమయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు. మరి సెలబ్రిటీలు ఇకనైనా తమను నమ్ముకున్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని స్వలాభం కోసం ఆలోచించకుండా ఇకనైనా జాగ్రత్తగా మసులుకుంటారేమో చూడాలి.