Begin typing your search above and press return to search.

"నేను కేవలం తెలుగు నటిని మాత్రమే కాదు.." మంచు లక్ష్మి

వరుస ప్రయోగాలతో ఆకట్టుకునే మంచు లక్ష్మి, ఇప్పుడు ‘బుకీ’ సినిమాతో మరో క్రేజీ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

By:  M Prashanth   |   18 Feb 2026 10:48 AM IST
నేను కేవలం తెలుగు నటిని మాత్రమే కాదు.. మంచు లక్ష్మి
X

వరుస ప్రయోగాలతో ఆకట్టుకునే మంచు లక్ష్మి, ఇప్పుడు ‘బుకీ’ సినిమాతో మరో క్రేజీ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా జరిగిన ఈ చిత్ర ప్రెస్ మీట్ లో ఆమె కెరీర్ లాంగ్వేజ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గణేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ ధీషన్, ఆర్.కె. ధనుష ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఫిబ్రవరి 20న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

ప్రెస్ మీట్ లో మంచు లక్ష్మికి భాషల పరంగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. తమిళంలో ఆమె స్లాంగ్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని, అక్కడ వర్క్ చేయడం ఎలా అనిపించిందని ఒక రిపోర్టర్ అడిగారు. దానికి సమాధానంగా ఆమె తమిళంలో అనర్గళంగా మాట్లాడి అందరినీ సర్ప్రైజ్ చేశారు. తాను పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే అని, అందుకే తనకు తమిళం చాలా బాగా వచ్చని క్లారిటీ ఇచ్చారు.

ఇక వేరే భాషల్లో నటించడంపై మంచు లక్ష్మి చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. “సాధారణంగా మన దగ్గర వేరే భాషల వాళ్ళను నెత్తిమీద పెట్టుకుంటాం కానీ, మన వాళ్ళను మాత్రం బయట అడుగు పెట్టనివ్వరని నేను ఎప్పుడూ కంప్లైంట్ చేస్తుంటాను. అలాంటిది నేను మలయాళం, తమిళం, హిందీ వంటి భాషల్లో సినిమాలు చేయడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది” అని ఆమె తెలిపారు.

ఒక ఆర్టిస్ట్ గా తనను తాను ఒకే భాషకు పరిమితం చేసుకోవడం ఇష్టం లేదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. తనను కేవలం తెలుగు నటిగా మాత్రమే కాకుండా, ఒక ఇండియన్ యాక్ట్రెస్ లేదా వరల్డ్ యాక్ట్రెస్ గా పిలిపించుకోవడమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ఆమెలోని ఈ పాన్ ఇండియా విజన్ ను అక్కడ ఉన్న వారంతా మెచ్చుకున్నారు.

ఈ ‘బుకీ’ సినిమాలో లక్ష్మీ మంచు క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. సునీల్, పాండియరాజన్ వంటి సీనియర్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. మంచు లక్ష్మి తన విలక్షణమైన నటనతో ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలిచారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ మీట్ లో తన మాటలతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు మంచు లక్ష్మి. ఇక ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానున్న ‘బుకీ’ మంచు లక్ష్మి కెరీర్ లో ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.