సముద్ర తీరాన మంచు లక్ష్మి.. గ్లామర్ క్వీన్!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనా, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్నారు మంచు లక్ష్మి.
By: M Prashanth | 21 Nov 2025 12:45 AM ISTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనా, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్నారు మంచు లక్ష్మి. నటిగా, నిర్మాతగా, టీవీ హోస్ట్గా ఆల్ రౌండర్ గా నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. తనదైన యాస, భాషతో, ముక్కుసూటితనంతో తెలుగు ప్రేక్షకులలో డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
లేటెస్ట్ గా మంచు లక్ష్మి తన వెకేషన్కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సముద్ర తీరాన, బోట్ల మధ్య నిలబడి వైట్ కలర్ షార్ట్ డ్రెస్లో ఎంతో స్టైలిష్గా, ఉల్లాసంగా కనిపిస్తున్నారు. తలపై టోపీ, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ ధరించి చిల్ అవుతున్న ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. "అలలు, మంచి వైబ్స్ కలిసే చోట నన్ను చూడండి" అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.
అమెరికాలో ఉన్నప్పుడే ఇంగ్లీష్ సిరీస్లలో నటించిన లక్ష్మి, ఇండియాకు వచ్చాక 'ప్రేమతో మీ లక్ష్మి', 'మేము సైతం' వంటి షోలతో పాపులర్ అయ్యారు. ఇక వెండితెరపై 'అనగనగా ఓ ధీరుడు', 'గుండెల్లో గోదారి', 'దొంగాట' వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఆమె ఎప్పుడూ ముందుంటారు.
ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మి హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కేవలం రెగ్యులర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల 'మాన్స్టర్' వంటి మలయాళ చిత్రంలోనూ నటించి మెప్పించారు.
సినిమాలు, షోలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి ఫుల్ యాక్టివ్గా ఉంటారు. తన ఫిట్నెస్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్లు, వెకేషన్ రీల్స్ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్లో ఉంటారు. వయసు పెరుగుతున్నా, తన ఎనర్జీ, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని ఈ లేటెస్ట్ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది.
