మంచు లక్ష్మి బర్త్ డే.. రకుల్ ఎక్కడ మేడమ్?
నటి మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చిన అమ్మడు.. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్నారు.
By: M Prashanth | 10 Oct 2025 9:37 PM ISTనటి మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చిన అమ్మడు.. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్నారు. అక్టోబర్ 8వ తేదీతో 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మంచు డాటర్. దీంతో అనేక మంది నెటిజన్లు, సెలబ్రిటీలు, సినీ ప్రియులు, అభిమానులు.. మంచు లక్ష్మికి నెట్టింట బర్త్ డే విషెస్ తెలిపారు.
అయితే ఆమె తన బర్త్ డే ను సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంటి మొత్తం బెలూన్స్ తో డెకరేట్ చేయగా.. మంచు డాటర్ కేక్ కట్ చేశారు. రెండు జడలు వేసుకుని క్యూట్ గా రెడీ అయిన అమ్మడు.. తెల్లటి టీ-షర్ట్, నల్ల ప్యాంటులో ప్రకాశవంతంగా నవ్వుతూ కనిపించారు. ఎంతో సంతోషంగా పుట్టినరోజు జరుపుకున్నారు.
అందుకు సంబంధించిన పిక్స్.. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారాయి. సూర్యుని చుట్టూ మరో సంవత్సరం గడిపినందుకు ధన్యవాదాలు! మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుంది అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. మంచు లక్ష్మి పోస్ట్ చేసిన పిక్స్ కూడా ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
అయితే మంచు డాటర్ పోస్ట్ చేసిన పిక్స్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఉన్నారు. ఆమెతోపాటు కుబ్రా సైట్ సహా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ సందడి చేశారు. కానీ లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మిస్ అయ్యారు. దీంతో రకుల్ ఎక్కడ మేడమ్ అని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. పోస్ట్ కూడా పెట్టలేదని ప్రస్తావించారు.
అదే సమయంలో ఆమె ఫోన్ ద్వారా లక్ష్మికి ప్రైవేట్ గా శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చని పలువురు నెటిజన్లు తెలిపారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారేమోనని.. అందుకే రాకపోయి ఉంటారని చెప్పారు. అయితే మొత్తానికి ఎప్పుడూ చిల్ గా ఉండే లక్ష్మి.. ఇప్పుడు పుట్టినరోజు కూడా అంతే సొగసుగా జరుపుకున్నారని చెప్పాలి.
ఇక మంచు లక్ష్మి అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల దక్ష మూవీతో వచ్చి.. మోస్తరు రెస్పాన్స్ అందుకున్నారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందించిన ఆ మూవీలో మోహన్ బాబు కూడా నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిన్న ప్రాజెక్టులకు గాను వర్క్ చేస్తున్నారు మంచు డాటర్.
