Begin typing your search above and press return to search.

తండ్రి కొడుకులు.. విలనిజంలో పోటీ..?

మంచు ఫ్యామిలీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి అంటే నిజమే అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి.

By:  Ramesh Boddu   |   29 Sept 2025 9:48 AM IST
తండ్రి కొడుకులు.. విలనిజంలో పోటీ..?
X

మంచు ఫ్యామిలీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి అంటే నిజమే అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఈమధ్య మోహన్ బాబు, మంచు విష్ణు మీద మనోజ్ గొడవ తెలిసిందే. ఫ్యామిలీలో జరిగే ఆ గొడవలను బయట పెట్టి నానా హంగామా చేశారు. ఐతే మంచు మనోజ్ చేస్తున్న పనులు మోహన్ బాబుని ఇబ్బంది పెడుతున్నా సరే అలా చూస్తూ వచ్చారు. ఇక ఫైనల్ గా ఫ్యామిలీ ఇష్యూ కొంతమేరకు సాల్వ్ అయినట్టే పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు మంచు మనోజ్ సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల మంచు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

ఆఫ్టర్ లాంగ్ టైం మంచు మనోజ్..

మంచు మనోజ్ లో మంచి ఎనర్జీ ఉంటుంది. అది ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఐతే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ భైరవంతో సర్ ప్రైజ్ చేశాడు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మంచు మనోజ్ స్క్రీన్ మీద చూసే సరికి ఆడియన్స్ ఖుషి అయ్యారు. ఇక తేజ సజ్జ మిరాయ్ లో మంచు మనోజ్ విలనిజం అదిరిపోయింది. సినిమాకు స్టార్ క్రేజ్ అంటే అది మనోజ్ వల్లే వచ్చింది.

అఫ్కోర్స్ కార్తీక్ టేకింగ్, తేజ సజ్జ కూడా మరో హైలెట్స్ అయ్యాయి. మంచు మనోజ్ మిరాయ్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సక్సెస్ తో మనోజ్ మళ్లీ కెరీర్ లో బిజీ కాబోతున్నాడు. ఇక మరోపక్క కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నాని ది ప్యారడైజ్ లో విలన్ గా చేస్తున్నారు. విలన్ గా మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు కూడా విలనిజానికి ఒక సెపరేట్ క్రేజ్ తెస్తున్నారు.

మోహన్ బాబు కెరీర్ మొదట్లో విలన్ గానే..

మోహన్ బాబు కెరీర్ మొదట్లో విలన్ గానే చేస్తూ వచ్చి ఆ క్రేజ్ తో హీరోగా టర్న్ తీసుకున్నారు. ఈమధ్య సినిమాలను పూర్తిగా తగ్గించిన మోహన్ బాబు నాని ది ప్యారడైజ్ కి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోహన్ బాబు విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నెగిటివ్ రోల్స్ తో తిరిగి కెరీర్ బిజీ చేసుకోవాలని చూస్తున్నారు. ఐతే ఇక్కడ విలనిజం లో కూడా తండ్రి కొడుకులు పోటీ పడేలా ఉన్నారు.

మిరాయ్ లో మనోజ్ విలనిజం చూశాం. బ్లాక్ స్వార్డ్ గా మనోజ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇంప్రెస్ చేశాడు. ఇక ప్యారడైజ్ లో మోహన్ బాబు ఎలా కనిపిస్తాడో చూడాలి. ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ లుక్ చూస్తే నాని సినిమాతో మోహన్ బాబు కూడా సూపర్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు.