మిస్ వరల్డ్ కాకముందు మానస వారణాసి ఏం చేసేవారో తెలుసా?
ఇటీవల సంతోష్ శోభన్‌తో కలిసి నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా మానస కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'మిత్ర'గా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
By: Madhu Reddy | 19 Feb 2026 3:52 PM ISTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ మానస వారణాసి పక్కా హైదరాబాదీ అమ్మాయి అని కొందరికే తెలుసు. మిస్ ఇండియా కిరీటం గెలిచినా, ఇంట్లో వాళ్ల కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే కలల వైపు అడుగులు వేసింది. ఈ వీకెండ్ లో వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో కెరీర్‌లో తొలి హిట్ అందుకున్న ఈ బ్యూటీ, తాను కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు.. పక్కా తెలంగాణ యాసలో తిట్టడం కూడా వచ్చని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు..వివరాలలోకి వెళితే..
సాఫ్ట్‌వేర్ అనలిస్ట్ నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా:
మానస ప్రయాణం అచ్చం సినిమా స్టోరీలాగే ఉంటుంది. పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా, తండ్రి ఉద్యోగం వల్ల మలేషియాలో చదువుకుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంజినీరింగ్ కాలేజీలో చదివే టైంలోనే మోడలింగ్‌పై మనసు పడింది. 2020లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించక ముందు రెండేళ్ల పాటు ఒక ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్సియల్ అనలిస్టుగా పనిచేసింది. ఆ తర్వాతే మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె తిరిగి ముంబైకి వచ్చేసిందట. ఇక అక్కడ ఏం చేయాలో తెలియక కొంతకాలం వర్క్ షాప్ చేస్తూ కెరియర్ కొనసాగించింది . కానీ 'దేవకీ నందన వాసుదేవ'సినిమాలో అవకాశం రావడంతో వెంటనే ముంబై నుండి హైదరాబాదు వచ్చేసి.. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే తొలి సినిమా ఆశించినంత ఆడకపోయినా, తన లుక్స్‌తో,పెర్ఫామెన్స్ తో మెప్పించింది.
'కపుల్ ఫ్రెండ్లీ' హిట్.. తెలంగాణ యాస వచ్చు :
ఇటీవల సంతోష్ శోభన్‌తో కలిసి నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా మానస కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'మిత్ర'గా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా సక్సెస్ మీట్ మరియు ఇంటర్వ్యూల్లో మానస చాలా సరదాగా మాట్లాడింది. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు తెలుగు స్పష్టంగా వస్తుందని, తన మేనేజర్ పక్కా తెలంగాణ అని చెప్పింది. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఆయనకు కోపం వస్తే తిట్టే తిట్లను వింటూ, తనకు కూడా కొన్ని బ్యాడ్ వర్డ్స్' మాట్లాడటం వచ్చేసిందని నవ్వుతూ బయటపెట్టింది. పద్ధతిగా కనిపించే ఈ మిస్ ఇండియాలో ఇలాంటి మాస్ యాంగిల్ కూడా ఉందని తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్‌లో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఈమేనా?:
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల కొరత చాలా ఉంది. శ్రీలీల వంటి వారు బిజీగా ఉన్నప్పటికీ, స్టార్ హీరోలకు జోడీగా నటించే సత్తా ఉన్న కొత్త ముఖాల కోసం మేకర్స్ వెతుకుతున్నారు. ఈ క్రమంలో మానస వారణాసికి మంచి ఛాన్స్ దొరికినట్లే కనిపిస్తోంది. పక్కా లోకల్ కావడం, అటు గ్లామర్ ఇటు పర్ఫార్మెన్స్ రెండూ ఉండటంతో దర్శకనిర్మాతల దృష్టి ఆమెపై పడింది. సంతోష్ శోభన్‌తోనే మరో సినిమా కూడా చేస్తున్నట్టు సమాచారం. తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటే, గ్లామర్ ప్రపంచంలో ఈ హైదరాబాదీ భామ లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం ఖాయం.
