వింటేజ్ రొమాంటిక్ లుక్.. ముద్దొచ్చేస్తున్న మానస!
చీరకట్టులో కూడా సాంప్రదాయంగా కనిపించి అభిమానులను అలరిస్తున్న నేటితరం హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .
By: Madhu Reddy | 19 May 2026 11:39 AM ISTచీరకట్టులో కూడా సాంప్రదాయంగా కనిపించి అభిమానులను అలరిస్తున్న నేటితరం హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకున్నప్పటికీ.. అందులో చాలా పద్ధతిగా చీర కట్టి నిండుగా చందమామలా కనిపించి, ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో మానస వారణాసి కూడా ఒకరు. అందానికి అందం.. అందుకు తగ్గట్టు అభినయం ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న మానస మరొకసారి మరో ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.
క్రీమ్ కలర్ ప్రింటెడ్ శారీ కట్టుకున్న ఈమె దీనికి ఆపోజిట్ రెడ్ కలర్ బ్లౌజ్ ధరించింది. మెరూన్ రెడ్ స్టోన్స్ పొదిగిన చెవి దిద్దులను ధరించిన ఈమె చేతికి డైమండ్ గాజులను తొడిగింది . ఇక నెక్ పీస్ ను బోసిగా ఉంచి.. ముఖానికి పర్ఫెక్ట్ మేకప్ అద్దుకొని తన కాటుక కళ్ళతో.. వింటేజ్ రొమాంటిక్ లుక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే మానస వారణాసి షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అచ్చం మన ఇంటి అమ్మాయిల ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
1997 మార్చి 27న హైదరాబాదులో జన్మించింది. ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా మలేషియాకు వెళ్ళిన ఈమె.. 2012లో జిఐఐఎస్ మలేషియా క్యాంపస్ నుండి గ్రేడ్ 10 పూర్తి చేసింది. మళ్ళీ హైదరాబాద్ కి వచ్చి ఎఫ్ఐఐటి జేఈఈ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె.. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదువును పూర్తి చేసి, ఫ్యాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విశ్లేషకురాలిగా కూడా పనిచేసింది.
2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీల్లో పాల్గొని టాప్ 3 ఫైనలిస్టులో ఒకరిగా నిలిచిన ఈమె.. 2020లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ కోసం ఆడిషన్ చేసి విజేతగా నిలిచింది. 2020 మిస్ ఇండియా పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది కూడా... ఇక ఇలా ఎన్నో అందాల పోటీలలో పాల్గొని పలు కిరీటాలను కూడా దక్కించుకుంది మానస.ఇక అలా పలు కార్యక్రమాలలో పాల్గొన్న మానస 2024లో దేవకి నందన వాసదేవా సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే క్యూట్ ఎక్స్ప్రెషన్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఈ ఏడాది సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో కుర్ర కారుకి ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాలో తన పాత్రతో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఇక మళ్ళీ సంతోష్ శోభన్ తో కలిసి మరో సినిమా చేస్తోంది. అది కూడా రొమాంటిక్ లవ్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా సాంప్రదాయంగా ఆకట్టుకుంటూ అందరిని అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
