Begin typing your search above and press return to search.

డెనిమ్ డ్రీమ్.. లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆకట్టుకుంటున్న మానస వారణాసి!

ఇండస్ట్రీలోకి రావాలనే తపన ఎంతోమంది అమ్మాయిలను మొదట మోడలింగ్ రంగం వైపు నడిపిస్తోందనే కామెంట్లు కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   21 July 2026 11:43 AM IST
డెనిమ్ డ్రీమ్.. లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆకట్టుకుంటున్న మానస వారణాసి!
X

ఇండస్ట్రీలోకి రావాలనే తపన ఎంతోమంది అమ్మాయిలను మొదట మోడలింగ్ రంగం వైపు నడిపిస్తోందనే కామెంట్లు కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్నారు. అందులో భాగంగానే మోడల్ గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఫ్యాషన్ షోలపై ర్యాంప్ వాక్ తో అదరగొట్టేసిన ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇప్పుడు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా ఒకప్పుడు మోడల్గా తన కెరీర్ను మొదలుపెట్టి.. మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుని.. ఇప్పుడు ముఖానికి మేకప్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది మానస వారణాసి.




2020లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాత ప్యూర్టోరికో లోని శాన్ జువాన్ లో జరిగిన మిస్ వరల్డ్ 2021లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టాప్ 13 కి చేరుకుంది. అలాంటి ఈమె తొలిసారి 2024 లో దేవకీ నందన వాసుదేవ అనే చిత్రంలో ఏకంగా సత్య, రాధా, రుక్మిణి అంటూ త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి అవకాశం అందులో ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించింది అంటే..ఈమె నటన ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.




మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈమె మళ్లీ ఒక ఏడాది గ్యాప్ తీసుకొని 2026లో కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మిత్రా పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ప్రతి అబ్బాయి లైఫ్ లో మిత్రా అనే అమ్మాయి ఉండాలి అనే రేంజ్ లో యువత కూడా సినిమా విడుదలైనప్పుడు తెగ కామెంట్లు చేశారు. అలా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ సంతోష్ శోభన్ తో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఒక కొత్త సినిమాతో వస్తామని ప్రకటించారు . మరి ఆ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఏమీ ప్రస్తుతానికి అందుబాటులో లేవని చెప్పాలి. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.




అందులో భాగంగానే తాజాగా డెనిమ్ షర్టు , స్కర్ట్ ధరించి తన అందాలను ఫుల్ ఫిల్ చేసుకుంది. పైగా ఈ ఫోటోలకు డెనిమ్ డ్రీమ్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మానస వారణాసి షేర్ చేసిన ఈ అవుట్ ఫిట్ లో నిండుగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి అయితే మానస వారణాసి షేర్ చేసిన ఈ లేటెస్ట్ డెనిమ్ డ్రీమ్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అంతేకాదు డెనిమ్ డ్రీమ్ అంటూ జత చేసిన క్యాప్షన్ కి ఈవిల్ ఐ ని కూడా జోడించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె తెలుగులో మరికొన్ని కథలు వింటున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మానస చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను అలరిస్తోంది. మొత్తానికి అయితే ఎనిమిది లక్షలు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న మానస వారణాసి ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ ను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పవచ్చు.