Begin typing your search above and press return to search.

చీరకట్టులో గిలిగింతలు పెడుతున్న మానస వారణాసి.. ఆ స్మైల్ కే ఫిదా గురూ!

ఇకపోతే తాజాగా అవే ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోవడంతో ఆమె అందాన్ని చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.

By:  Madhu Reddy   |   4 Feb 2026 10:43 PM IST
చీరకట్టులో గిలిగింతలు పెడుతున్న మానస వారణాసి.. ఆ స్మైల్ కే ఫిదా గురూ!
X

సినిమా అనే రంగుల ప్రపంచంలో ముఖానికి రంగు పులుముకొని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎంతోమంది పరితపిస్తున్నారు. అందులో భాగంగానే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వారసులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. ఇంకొంతమంది సినిమాపై ఇష్టంతో మోడల్స్ గా మారి ఇష్టంతో కష్టమైన పనులను కూడా చేస్తూ ఆఖరికి మిస్ ఇండియా, తెలంగాణ మిస్ వరల్డ్ టైటిల్స్ ను సొంతం చేసుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

అలా మార్గం ఏదైనా సరే ఇండస్ట్రీలోకి రావాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. అలాంటి వారిలో మానస వారణాసి కూడా ఒకరు. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని అందుకున్న ఈమె.. పలు యాడ్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక 2020 డిసెంబర్ 20న కోకో కోలా మ్యూజిక్ హాల్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి పదవ స్థానంలో నిలిచింది. అలాంటి మానస వారణాసి 1997 మార్చి 27న హైదరాబాదులో జన్మించింది.. ఈమె తండ్రి ఉద్యోగం కారణంగా మలేషియాకు వెళ్లిన మానస 2012లో పదవ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి.. ఎఫ్ఐఐటి జేఈఈ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె.. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఫ్యాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విశ్లేషకురాలిగా కూడా పనిచేసింది.

ఇక ఆ తర్వాతే మోడల్ గా మారి పలు అందాల పోటీలలో పాల్గొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత ఏడాది దేవకీ నందన వాసుదేవా అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో అశోక్ గల్లా హీరోగా నటించారు. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్గా వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని యు వి క్రియేషన్స్ , యు వి కాన్సెప్ట్స్ బ్యానర్లపై అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అందులో తన అద్భుతమైన లుక్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మానస వారణాసి.

ఇకపోతే తాజాగా అవే ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోవడంతో ఆమె అందాన్ని చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. బ్లూ కలర్ ప్లెయిన్ నెట్టేడ్ శారీ కి కలర్ ఫుల్ గా ఎంబ్రాయిడరీ డిజైన్ తో బార్డర్ ను రూపొందించారు.. ఈ చీరకట్టలో మానస తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. సింపుల్ లుక్ లో చాలా సింపుల్ గా స్మైల్ ఇచ్చి అభిమానుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం మానస వారణాసి షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.