చందమామ లేని లోటు తీరుస్తున్న మానస
అందాల రాశి, తెలుగమ్మాయి మానస వారణాసి సోషల్ మీడియాలో జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. నిరంతరం లేటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ, ఈ బ్యూటీ తన అభిమానులను ఎంగేజ్ చేస్తోంది.
By: Sivaji Kontham | 26 July 2026 8:03 AM ISTఅందాల రాశి, తెలుగమ్మాయి మానస వారణాసి సోషల్ మీడియాలో జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. నిరంతరం లేటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ, ఈ బ్యూటీ తన అభిమానులను ఎంగేజ్ చేస్తోంది. తనదైన సౌందర్యం.. ఆకట్టుకునే శైలితో కళాత్మక రూపం మురిపిస్తూనే ఉంటుంది. ఇటీవల 'బిగమింగ్' అనే చిన్న ట్యాగ్ తో షేర్ చేసిన లేటెస్ట్ శారీ లుక్ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సొరా బై స్వప్న డిజైన్ చేసిన సంప్రదాయ చీరకట్టులో మానస ఎంతో ప్రశాంతంగా, క్లాసిక్ లుక్‌లో మెరిసిపోయారు.
ఈ ఫొటోలు ఆధునిక మోడలింగ్ శైలికి...భారతీయ సంప్రదాయానికి చక్కని మెర్జర్ గా కనిపిస్తున్నాయి. సంప్రదాయ చీరకట్టులో మానస స్టైల్ కంటెంట్, ఆత్మవిశ్వాసం అభిమానులను కట్టిపడేసింది. వేకువఝాము వెలుగు రేఖలను... ప్రకృతి లయను మిళితం చేస్తూ తీసిన ఫోటోగ్రాఫ్స్ యూనిక్ అప్పియరెన్స్ తో మైమరిపిస్తున్నాయి. ఒక మాజీ మిస్ ఇండియాగానే కాకుండా సినీ రంగంలో ప్రతిభావంతమైన నటిగా మానసకు ఇప్పటికే గుర్తింపు రావడంలో ఫ్యాషన్ ఎంపికల పాత్రను విస్మరించలేం.
ఈ శారీ లుక్ రివీలైన కొద్దిసేపటికే అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. వందలాది మంది కామెంట్ల రూపంలో హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కరౌసెల్‌లోని ఫొటోలలో ముఖ్యంగా 3, 5 , 7వ ఫొటోలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజనులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంప్రదాయ చీరకట్టులో సహజసిద్ధమైన గ్రేస్, లుక్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ లుక్ చూడగానే చందమామ కాజల్ లేని లోటును కూడా తీరుస్తోంది! అంటూ పొగిడేస్తున్నారు.
సాధారణ ప్రశంసలతో పాటు మానసకు తన అభిమానులతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా ఈ పోస్ట్ గుర్తు చేసింది. కొందరు 'లైటింగ్ క్వీన్' అని ప్రేమగా పిలవగా.. మరికొందరు నిజ జీవితంలో తనను కలిసినప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఒక అభిమాని విమానాశ్రయం లాంజ్‌లో మానసను చూసినా కానీ తన ప్రైవసీని గౌరవిస్తూ సెల్ఫీ అడగలేదని రాసిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా.. సినీ దర్శకుడు రవిశర్మ వంటి ప్రముఖులు కూడా కామెంట్లలో ప్రశంసలు కురిపించడం తనకు ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతోంది.
సహజమైన ఫ్యాషన్ అభిరుచితో పాటు వినయవిధేయతలు కలిగిన వ్యక్తిత్వం మానస వారణాసికి నిరంతరం ఫాలోయింగ్ ని పెంచుతోంది. మోడలింగ్, ఫ్యాషన్, సినిమా రంగాలలో ముందుకు సాగుతున్న మానస మునుముందు రోజుల్లో కూడా తన ప్రతిభతో వీక్షకులను అలరిస్తూ మరింత మెరుగైన స్థానాన్ని చేరుకుంటారనడంలో సందేహం లేదు. మానస వారణాసి నటనా ప్రయాణంలో `దేవకీ నందన వాసుదేవ` (2024) చిత్రం ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. ఇందులో ఆమె సత్య, రాధ, రుక్మిణిగా త్రిపాత్రాభినయంతో తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత 2026లో వస్తున్న`కపుల్ ఫ్రెండ్లీ` సినిమాలో మిత్ర పాత్రలో కథానాయికగా నటిస్తూ.... తెలుగు చిత్రసీమలో ఒక వర్ధమాన నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.
