Begin typing your search above and press return to search.

హీరోతో 'కిస్' సీన్.. మానస ఒపీనియన్ ఏంటో తెలుసా?

తెలుగు అందం మానస వారణాసి గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణకు చెందిన మోడల్, అందాల పోటీ విజేత అయిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని చెప్పాలి

By:  M Prashanth   |   4 Feb 2026 6:00 PM IST
హీరోతో కిస్ సీన్.. మానస ఒపీనియన్ ఏంటో తెలుసా?
X

తెలుగు అందం మానస వారణాసి గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణకు చెందిన మోడల్, అందాల పోటీ విజేత అయిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని చెప్పాలి. మలేసియాలో పుట్టి పెరిగిన ఆమె.. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి 2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో పాల్గొని ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. 2020లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ సొంతం చేసుకున్నారు అమ్మడు.

ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె.. ఆ తర్వాత వివిధ అందాల పోటీల్లో సత్తా చాటింది. మోడలింగ్ రంగంలో ఉండాలా.. లేక జాబ్ చేయాలా అని ఆలోచిస్తూ.. మూవీ వర్క్ షాప్ కు వెళ్లి ఆడిషన్ ఇచ్చింది మానస. ఆ సమయంలో దేవకీ నందన వాసుదేవ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు రిజల్ట్ విషయంలో నిరాశ ఎదురైంది.

ఇప్పుడు తన ఆశలన్నీ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ పైనే పెట్టుకుంది అమ్మడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఆ చిత్రంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన నటించారు మానస వారణాసి. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ‌గా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే సినిమాలో కిస్ సీన్స్ లో మానస నటించినట్లు ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా కిస్ సీన్స్ పై ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిస్ అంటే.. దాన్ని చిన్నగా, సింపుల్ గా ఉంచాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మానస చేసిన కామెంట్ కు సంబంధించిన వీడియో.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండడంతో.. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో కపుల్ ఫ్రెండ్లీ మూవీలో మిత్ర అనే పాత్రలో నటించానని, అలాంటి అందమైన పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రోల్ తో తాను పర్సనల్‌ గా బాగా కనెక్ట్ అయ్యానని చెప్పిన మానస.. తన పర్సనల్ లైఫ్‌ కు మూవీలో చేసిన పాత్ర చాలా దగ్గరగా ఉంటుందని తెలిపారు. సినిమా అంతా ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిదంటూ చెప్పుకొచ్చారు.

అయితే చెన్నై బ్యాక్ డ్రాప్‌ లో సాగే ఫ్రెష్, యంగ్ లవ్ స్టోరీనే మూవీ అని, చెన్నైలోని అనేక ప్రాంతాల్లో గెరిల్లా టైప్‌ లో షూటింగ్ జరిగిందని తెలిపింది. సంతోష్ శోభన్ చాలా మంచి యాక్టర్, ఆయన డెడికేషన్- ప్రతి సీన్‌ లో ఇంకా బాగా నటించాలనే తపన నచ్చాయన్న మానస.. ఆయన నుంచి చాలా నేర్చుకుందట. ముఖ్యంగా కపుల్ ఫ్రెండ్లీ.. కపుల్స్ కోసమే కాదు.. సింగిల్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం అంటున్న అమ్మడు.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.