లవ్ రిలేషన్ పై మానస వారణాసి షాకింగ్ కామెంట్స్!
సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో ఉండే తారల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది.
By: Madhu Reddy | 10 Feb 2026 3:40 PM ISTసాధారణంగా గ్లామర్ ప్రపంచంలో ఉండే తారల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ముఖ్యంగా మిస్ ఇండియా వంటి కిరీటం గెలుచుకున్న అందాల సుందరి లవ్ లైఫ్ అంటే ఇంకెన్ని అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. కానీ, 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రెస్ మీట్‌లో మానస వారణాసి తన ప్రేమ ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఫిబ్రవరి 14 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విశేషాలేంటో చూద్దాం..
వాలెంటైన్స్ డే లేని లైఫ్:
రీసెంట్‌గా జరిగిన 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రెస్ మీట్‌లో హీరోయిన్ మానస వారణాసి తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాకు కాలేజీ రోజుల్లో అస్సలు బాయ్‌ఫ్రెండ్స్ లేరు, అందుకే నా లైఫ్ లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ అనేవే లేవు" అని ఆమె సరదాగా చెబుతూనే అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు 'సీతారామం' లాంటి స్వచ్ఛమైన ప్రేమకథలంటే ఎంతో ఇష్టమని, నిజ జీవితంలో కూడా ఓవర్ థింకింగ్ పక్కన పెట్టి, స్వతంత్రంగా ఉండటానికే తాను ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. సినిమాలో తాను పోషించిన 'మిత్ర' పాత్ర కూడా తన వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని, అందుకే ఆ క్యారెక్టర్‌తో తాను సులభంగా కనెక్ట్ అయ్యానని ఆమె వివరించారు.
మానస వారణాసి మొదటి సినిమా:
టాలీవుడ్‌లోకి సరికొత్త గ్లామర్‌తో పాటు ప్రతిభను కూడా పరిచయం చేస్తున్న నటి మానస వారణాసి. 2020లో 'మిస్ ఇండియా' కిరీటాన్ని గెలుచుకున్న ఈ హైదరాబాద్ సుందరి, మోడలింగ్ రంగంలో తన సత్తా చాటి ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెడుతోంది. కేవలం అందం మాత్రమే కాకుండా, సామాజిక అంశాల పట్ల అవగాహన మరియు విశ్లేషణాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తిగా ఆమెకు మంచి పేరుంది. తన మొదటి సినిమాగానే 'కపుల్ ఫ్రెండ్లీ' వంటి యూత్-సెంట్రిక్ కథను ఎంచుకోవడం ఆమె అభిరుచికి నిదర్శనం.
నేటి తరం జంటల ప్రతిబింబం:
ఈ చిత్రం ప్రస్తుత కాలంలోని యువత ఆలోచనా దృక్పథాన్ని, వారి మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలను చర్చిస్తుంది. సంతోష్ శోభన్, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, "మిత్ర లేనిదే శివ లేడు" అనే ఎమోషనల్ పాయింట్‌తో నడుస్తుంది. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని ధీమా వ్యక్తం చేసారు టీమ్. మిత్ర కోసం శివ ఏం చేశాడు? తన స్వతంత్రతను చాటుకునే అమ్మాయిగా మిత్ర ప్రయాణం ఎటు సాగింది? అనే అంశాలను దర్శకుడు చాలా హృద్యంగా ఆవిష్కరించారు. రొమాంటిక్ కామెడీగా మొదలై, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ఈ సినిమా ముగుస్తుంది. వాలంటైన్స్ డే రోజు ఈ అందమైన ప్రేమకథ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను కట్టిపడేస్తుందో చూడాలి..
