Begin typing your search above and press return to search.

మన కథలు చెప్పాలి.. కానీ ఇలా!

ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్ లాంటి సినిమాల‌కు ఎక్కువ ఆదరణ పెరుగుతోందా? అనే ప్రశ్నకు రాకాస డైరెక్ట‌ర్ మానస శర్మ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 April 2026 4:58 PM IST
మన కథలు చెప్పాలి.. కానీ ఇలా!
X

మన రూటెడ్ కథలు చెప్పకపోవడం వల్లే హాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్ లాంటి సినిమాల‌కు ఎక్కువ ఆదరణ పెరుగుతోందా? అనే ప్రశ్నకు రాకాస డైరెక్ట‌ర్ మానస శర్మ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసిన ఆమె, తన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా సూచించారు.

మానస శర్మ మాట్లాడుతూ, రూటెడ్ క‌థ‌లు చెప్ప‌క‌పోవ‌డం వ‌ల్ల MCU సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుంద‌ని తాను అనలేద‌ని, మనం రూటెడ్ కథలు చెప్పకపోతేనే ఇతర ఇండస్ట్రీల సినిమాలు హిట్ అవుతున్నాయనే కోణంలో తాను మాట్లాడలేద‌ని, కానీ అలాంటి కథలను కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, మన పాత కథలను కొత్తగా చెప్పే ప్రయత్నం చేయాల‌నేదే త‌న‌ అభిప్రాయ‌మ‌ని వెల్లడించారు. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కథలు వినేందుకు సిద్ధంగా ఉంటారని, ఎంటర్టైన్‌మెంట్ కోసం ఓపిక కూడా చూపిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో, మానస శర్మ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న సూపర్‌హీరో, ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ సమయంలో, మన సంస్కృతి, భావోద్వేగాలతో కూడిన కథలను కూడా అదే స్థాయిలో చెప్పగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆమె అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే, మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రాకాస ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా, నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఫాంటసీ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాకాస నుంచి విడుదలైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటూ కామెడీని మిళితం చేసిన ఈ కథ, కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.