Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ మూవీ.. స్టేజ్ పై ఏడ్చేసిన లేడీ డైరెక్టర్

మానస శర్మ, ఇట్లు అర్జున దర్శకుడు మహేష్ ఉప్పాల ఇద్దరూ టెన్త్ క్లాస్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. అప్పట్లోనే సినిమాలు తీయాలనే ఆలోచన ఇద్దరికీ ఉండేదట.

By:  M Prashanth   |   20 Sept 2026 11:13 AM IST
ఫ్రెండ్ మూవీ.. స్టేజ్ పై ఏడ్చేసిన లేడీ డైరెక్టర్
X

మూవీ ఈవెంట్లలో నార్మల్ గా సినిమా గురించి మాట్లాడతారు.. హీరో, హీరోయిన్, దర్శకుడిని పొగుడుతారు. కానీ ఇట్లు అర్జున మూవీ టీజర్ లాంచ్‌ లో మాత్రం ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడుతుండగా ఊహించని ఎమోషనల్ మూమెంట్ కనిపించింది. తన ఫ్రెండ్ సినిమా గురించి చెబుతూ యంగ్ లేడీ డైరెక్టర్ మానస శర్మ స్టేజ్‌ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నప్పటి డ్రీమ్ గుర్తుకు రావడంతో ఆమె ఎమోషన్ ను ఆపుకోలేకపోయారు.

మానస శర్మ, ఇట్లు అర్జున దర్శకుడు మహేష్ ఉప్పాల ఇద్దరూ టెన్త్ క్లాస్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. అప్పట్లోనే సినిమాలు తీయాలనే ఆలోచన ఇద్దరికీ ఉండేదట. కాలేజీ, జాబ్, సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు.. ఇలా ఎవరి జర్నీ వారు సాగినా ఆ ఫ్రెండ్ షిప్ మాత్రం కంటిన్యూ అయింది. ఇప్పుడు ఇద్దరూ దర్శకులుగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని మానస శర్మ గుర్తుచేసుకున్నప్పుడు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

మహేష్ తన ఫ్రెండ్ మాత్రమే కాదు.. తనతో కలిసి సినిమా కలలు కన్న వ్యక్తి అంటూ మానస శర్మ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికే రాకాస మూవీతో దర్శకురాలిగా సిల్వర్ స్రీన్ కు వచ్చానని, ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ కూడా దర్శకుడిగా సినిమా చేయడం తనకు చాలా హ్యాపీగా ఉందన్నారు. తన సినిమా విషయంలో కూడా ఇంతగా ఎమోషనల్ కాలేదేమో అంటూ నవ్వుతూనే కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది.

ఇక్కడే మానస శర్మ కామెంట్స్ లోని ఎమోషన్ స్పెషల్ గా కనిపించింది. ఒక ఫ్రెండ్ సినిమా రిలీజ్ అవుతుందన్న ఆనందం మాత్రమే కాదు.. టెన్త్ క్లాస్ లో మొదలైన ఓ కల ఇన్నేళ్ల తర్వాత స్క్రీన్ పై కనిపించబోతోందన్న సంతోషం కూడా ఆమె మాటల్లో కనిపించింది. అందుకే మహేష్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఆమె ఏడ్చేశారు. సినిమాల్లోకి రావాలనుకునే చాలా మందికి ఫస్ట్ స్టెప్స్ దగ్గరే ఎన్నో డౌట్స్ ఉంటాయి.

కానీ కలిసి మొదలుపెట్టిన జర్నీలో ఇద్దరూ తమదైన గుర్తింపు తెచ్చుకోవడం ఆ మూమెంట్ కు మరింత స్పెషాలిటీ తీసుకొచ్చింది. ఇట్లు అర్జున సినిమా గురించి కూడా మానస శర్మ ఆసక్తికర విషయాలు చెప్పారు. మహేష్ కథ చెప్పగానే హీరో అనీష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఇందులో మూగ పాత్రలో కనిపించేందుకు అనీష్ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని నెలల పాటు ఆ రోల్ కోసం హార్డ్ వర్క్ చేశారని ప్రశంసించారు. అనస్వర రాజన్ సూపర్ అని, ఓ క్లాసిక్ హీరోయిన్ అని అన్నారు.

ఇక మహేష్ ఉప్పాల తనకు తెలిసిన మంచి రైటర్స్ లో, ఫిల్మ్ మేకర్లలో ఒకరని మానస శర్మ చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు ఇట్లు అర్జునను చూసి ఆదరించాలని కోరారు. సినిమా బాగుంటుందని అన్నారు. అలా ఇట్లు అర్జున టీజర్ లాంచ్ ఈవెంట్‌ లో ఒక లేడీ డైరెక్టర్ తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ కోసం స్టేజ్‌ పైనే కన్నీళ్లు పెట్టుకున్న విషయం నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.