Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమా.. ఒకేసారి అన్ని భాష‌ల్లోకి!

ప్రపంచ‌వ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు అందుకున్న ఈ సినిమా ఓటీటీలోక ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆడియ‌న్స్ ఎదురుచూస్తుండ‌గా, దానికి సంబంధించిన అప్డేట్ వ‌చ్చేసింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Feb 2026 10:31 PM IST
మెగాస్టార్ సినిమా.. ఒకేసారి అన్ని భాష‌ల్లోకి!
X

ఈ సంవ‌త్స‌రం సంక్రాంతి బ‌రిలో ప‌లు సినిమాలు రిలీజ‌య్యాయి. వాటిలో ప్ర‌భాస్ ది రాజా సాబ్, చిరంజీవి మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు, ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి, న‌వీన్ పోలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, శ‌ర్వానంద్ నారీ నారీ న‌డుమ మురారి ఉన్నాయి. వీటిలో ప్ర‌భాస్ ది రాజా సాబ్ సినిమా మిన‌హాయించి మిగిలిన సినిమాల‌న్నింటికీ మంచి రెస్పాన్సే వ‌చ్చింది.

ప్రీమియ‌ర్ల నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్

కానీ ఈ ఏడాది సంక్రాంతి విన్న‌ర్ గా నిలిచింది మాత్రం మెగాస్టార్ సినిమానే. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్రీమియ‌ర్ల నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌తో ర‌ఫ్ఫాడించింది. అనిల్ మార్క్ కామెడీ, చిరూ మేన‌రిజ‌మ్స్ ఆడియ‌న్స్ ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

రిలీజై మూడు వారాలైనా మంచి ర‌న్

వాటికి తోడు ఈ మూవీలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించ‌డంతో పాటూ విక్ట‌రీ వెంక‌టేష్ అతిథి పాత్ర‌లో మెప్పించ‌డం కూడా సినిమాకు బాగా ప్ల‌స్ అయ్యాయి. సినిమా రిలీజై మూడు వారాలు దాటినా ఇప్ప‌టికీ మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు థియేట‌ర్ల‌లో బాగానే ర‌న్ అవుతుందంటే ఈ మూవీతో చిరూ ఎంత పెద్ద స‌క్సెస్ ను అందుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

త్వ‌ర‌లోనే ఓటీటీలోకి..

ప్రపంచ‌వ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు అందుకున్న ఈ సినిమా ఓటీటీలోక ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆడియ‌న్స్ ఎదురుచూస్తుండ‌గా, దానికి సంబంధించిన అప్డేట్ వ‌చ్చేసింది. మ‌న శంక‌ర‌వర‌ప్ర‌సాద్ గారు మూవీ డిజిట‌ల్ రైట్స్ ను భారీ ధ‌ర‌కు జీ5 సంస్థ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఓటీటీలోకి రానున్న‌ట్టు స‌మాచారం. అంటే సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల‌కే ఓటీటీలోకి వ‌చ్చేలా మేక‌ర్స్, ఓటీటీ సంస్థ మ‌ధ్య డీల్ జ‌రిగింద‌న్న‌మాట‌.

మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా ఫిబ్ర‌వ‌రి 11 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు జీ5 త‌న యాప్ క్యాట‌లాగ్ లో ప్ర‌స్తావించ‌డంతో ఈ సినిమా ఓటీటీ విష‌యంలో క్లారిటీ వ‌చ్చింది. అంతేకాదు, ఈ సినిమా తెలుగుతో పాటూ హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, మ‌రాఠీ, బెంగాలీ భాష‌ల్లోనూ ఒకేసారి రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగాస్టార్, మ‌రి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటారో చూడాలి.