శంకర వర ప్రసాద్ ముగించేది ఫిక్సైంది!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 157 చిత్రం `మన శంకరవర ప్రసాద్` షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 7 Sept 2025 4:11 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 157 చిత్రం `మన శంకరవర ప్రసాద్` షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి అనీల్ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా టీమ్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. చిరంజీవి సైతం అంతే ఉత్సాహంగా బరిలో కి దిగడంతో చకాచకా షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్స్ ఎక్కడా డిస్టర్బ్ కాకుండా పూర్తవుతున్నాయి. అనీల్ కూడా ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లకుండా వీలైనంత వరకూ హైదరాబాద్ లోనే పక్క ప్లానింగ్ తో చిత్రీకరిస్తున్నారు. అవసరమైన సెట్ల ను సమకూర్చుకుని ముగించేస్తున్నారు.
నవంబర్ కి ముగింపు
అనీల్ సినిమా అంటే పెద్దగా సెట్లు కూడా ఉండవు. వీలైనంత వరకూ రియల్ లొకేషన్స్ లోనే షూటింగ్ పూర్తి చేయడం అనీల్ ప్రత్యేకత. నిర్మాతకు ముందు చెప్పిన బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేయడం అనీల్ లో మరో ప్రత్యేకత. సరిగ్గా ఇదే ప్రణాళికను 157కు ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నట్లు నిర్మాత సాహూ గారపాటి తెలిపారు. కార్మికులు బంద్ చేయ కుండా ఉంటే అక్టోబర్ కే షూటింగ్ మొత్తం పూర్తయ్యేదన్నారు. ఆ కారణంగా మరో నెల రోజులు అదనంగా పడుతుందని నవంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో చిత్రీకరణ పూర్తవుతుందన్నారు.
వాయిదా లేని ఒకే ఒక్కడు
అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో రెండు నెలలు సమయం పడుతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ ఉంటుందని ప్రారంభోత్సవ సమయంలోనే ప్రకటించిన నేపథ్యంలో చెప్పిన తేదీకే శంకర్ ప్రసాద్ వచ్చేస్తాడని మరోసారి క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా అనీల్ సినిమాలు వాయిదా పడవు. ప్రకటించిన తేదీకే సినిమా రిలీజ్ చేయడం అనీల్ కే చెల్లిందే. ఇంత వరకూ ఏ సినిమా విషయంలో డిలేలు జరగ లేదు. వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయడం..అందుకోసం అనీల్ టీమ్ అందర్నీ పరు గులు పెట్టి పని చేయిస్తాడని ఆయనతో పనిచేసిన నటీనటలు..సాంకేతిక నిపుణులు చెబుతుంటారు.
రిలీజ్ క్లారిటీ లేని చిత్రం
అన్న ట్లుగానే చిరు సంక్రాంతి సందడి షురూ అవుతుంది. ఈ సినిమా కంటే ముందే చిరంజీవి `విశ్వంభర` ప్రాజెక్ట్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా రిలీజ్ విషయంలో ఇంత వరకూ క్లారిటీ లేదు. షూటింగ్ సహా అన్ని పనులు నెమ్మదిగానే సాగుతున్నాయి. కొన్ని నెలలుగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది. అవి ఏ దశకు చేరాయి? అన్నది ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ఏడాది ముగిం పుకైనా రిలీజ్ పై క్లారిటీ వస్తుందని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.
