Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ సాంగ్ కోసం అనిల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా?

చిరూ కామెడీ టైమింగ్ కు, అనిల్ రావిపూడి రైటింగ్ క‌లిస్తే ఆ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Nov 2025 12:28 PM IST
స్పెష‌ల్ సాంగ్ కోసం అనిల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా?
X

టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో విక్ట‌రీ వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందిస్తున్నారు.

భారీ అంచ‌నాలతో రూపొందుతున్న మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు

చిరూ కామెడీ టైమింగ్ కు, అనిల్ రావిపూడి రైటింగ్ క‌లిస్తే ఆ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దానికి వెంకీ కూడా తోడైతే ఇక థియేట‌ర్ల‌లో నెక్ట్స్ లెవెల్ లో న‌వ్వులు పూయ‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలోనే మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోకుండా అనిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

చిరూ, అనిల్ మూవీలో స్పెష‌ల్ సాంగ్

ఆల్రెడీ ఈ మూవీ నుంచి వ‌చ్చిన టైటిల్ గ్లింప్స్, ఫ‌స్ట్ సింగిల్ కు ఆడియ‌న్స్ నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో అనిల్ ఓ స్పెష‌ల్ సాంగ్ ను కూడా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ తో క‌లిసి మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు కోసం అనిల్ ఓ స్పెష‌ల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నార‌ని, ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాల‌ని అనిల్ అనుకుంటున్నార‌ట‌.

స్టార్ హీరోయిన్ తో చేయాల‌ని ప్లాన్

చిరంజీవి, న‌య‌న‌తార‌, వెంక‌టేష్ లాంటి స్టార్లు న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీకి క‌మ‌ర్షియ‌ల్ గా మంచి డిమాండ్ ఉండే అవ‌కాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అనిల్ ఈ స్పెష‌ల్ సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే అనిల్ కు ఓ సెంటిమెంట్ ఉంది. త‌న గ‌త సినిమాల్లో హీరోయిన్లుగా న‌టించిన వారితో అనిల్ ఇప్ప‌టివ‌ర‌కు స్పెష‌ల్ సాంగ్స్ చేయిస్తూ వ‌చ్చారు. మ‌రి ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతారా లేదంటే దాన్ని బ్రేక్ చేసి కొత్త హీరోయిన్ ను ఈ సినిమా కోసం అనిల్ రంగంలోకి దింపుతారో చూడాలి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీని సాహు గార‌పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.