మెగాస్టార్ తో విక్టరీ బాక్స్ బద్దలయ్యేలా!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 157వ చిత్రం `మన శంకర వరప్రసాద్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 30 Aug 2025 3:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 157వ చిత్రం `మన శంకర వరప్రసాద్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ప్రారంభోత్సవం నుంచి అనీల్ ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ పనిలోనే బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రధాన తారలు తప్పా మిగతా అందరూ షూట్ లో పాల్గొం టున్నారు. సంక్రాంతి టార్గెట్ రిలీజ్ ఫిక్స్ అవ్వడంతో అనీల్ షెడ్యూల్ ఎక్కడా డిస్టబెన్స్ కాకుండా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాడు.
చిరుతో వెంకీ యాక్షన్:
ఇదే సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన ఎంట్రీ ఎప్పుడు? ఉంటుంది అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. దీంతో వెంకీ కేవలం గెస్ట్ రోల్ కే పరిమితమవుతారా? అన్న సందేహం కూడా తెరపైకి వస్తోంది. తాజాగా అందుతోన్న సమచారం మేరకు వెంకటేష్ కూడా సినిమాలో స్ట్రాంగ్ రోల్ పోషిస్తున్నట్లు కనిపిస్తుంది. చిరంజీవి తో వెంకటేష్ కాంబినేషన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని టీమ్ నుంచి లీకైంది. చిరుతో పాటు వెంకీ యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తారుట.
తొలిసారి ఇద్దరు సీనియర్లు:
ఈ యాక్షన్ సన్నివేశం కూడా ఓ కాన్సెప్ట్ ప్రకారం డిజైన్ చేసారుట. వినోదం,యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే కుటుంబ కథా చిత్రమిది. దీంతో యాక్షన్ సన్నివేశంలో ఫన్ కూడా యాడ్ అవుతుందని తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. చిరంజీవి-వెంకటేష్ ఇంత వరకూ ఏ చిత్రంలో కలిసి నటించలేదు. దీంతో ఆ కాంబినేషన్ లో సన్నివేశాలు ఎలా ఉంటాయి? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇద్దరు మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులు. కానీ ఆ టైమింగ్ వేర్వేరుగా ఉంటుంది.
హ్యాట్రిక్ తర్వాత వెంకీ:
ఈ విషయంలో వెంకీ చిరునే డామినేట్ చేస్తారు. మరి ఆ కామెడీ టింజ్ ను అనీల్ ఎలా రాబట్టుకుంటు న్నారో చూడాలి. ఇప్పటికే వెంకటేష్ తో కలిసి పని చేసిన అనుభవం అనీల్ కు ఉంది. `ఎఫ్ -2`, `ఎఫ్ 3`, `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రాలతో వెంకీ కామెడీ టైమింగ్ ని పట్టాడు అనీల్. సినిమాకు ఆ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. మరి ఆ టైమింగ్ ని చిరుతో ఎలా మ్యాచ్ చేస్తారో చూడాలి. `సంక్రాంతికి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ మరో కొత్త చిత్రం కమిట్ అవ్వని సంగతి తెలిసిందే.
