Begin typing your search above and press return to search.

MSG మరో సర్ప్రైజ్.. ఈసారి 'హుక్ స్టెప్'కు మించి..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారుపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

By:  M Prashanth   |   9 Jan 2026 3:34 PM IST
MSG మరో సర్ప్రైజ్.. ఈసారి హుక్ స్టెప్కు మించి..
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారుపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, గ్లింప్సెస్, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

రీసెంట్ గా సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన హుక్ స్టెప్ సాంగ్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. సోషల్ మీడియాలో ఆ సాంగ్ కు సంబంధించిన రీల్స్, షార్ట్స్ ఫుల్ గా ట్రెండ్ అవుతూ మెగాస్టార్ డ్యాన్స్ మ్యాజిక్ ను మరోసారి నిరూపించాయి. అయితే ఇప్పుడు ఆ హుక్ స్టెప్ సాంగ్‌ ను మించి ఉండేలా మరో స్పెషల్ సాంగ్‌ ను మేకర్స్ సిద్ధం చేసినట్లు సమాచారం.

ఆ స్పెషల్ సాంగ్ కోసం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా.. ప్రమోషన్ చేయకుండా డైరెక్ట్ గా థియేటర్లలోనే ప్రేక్షకులకు చూపించనున్నారట మేకర్స్. అంటే యూట్యూబ్‌ లో, సోషల్ మీడియాలో ముందుగా విడుదల చేయకుండా.. సినిమా చూస్తున్న సమయంలో సాంగ్ తో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారని సమాచారం. అది సినిమాకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌ గా నిలవనుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే ఆ సాంగ్ చిరంజీవి అభిమానులకు ఫుల్ ఫీస్ట్‌ లా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసొచ్చేలా ఆ సాంగ్‌ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్యాన్స్ పరంగా ఇది హుక్ స్టెప్ సాంగ్‌ ను మించి ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని టాక్. దీంతో థియేటర్లు ఆడియన్స్ విజిల్స్, చప్పట్లు, కేరింతలతో హోరెత్తనున్నాయట.

అదే సమయంలో మన శంకరవరప్రసాద్ గారు మూవీని ఫ్యామిలీ స్టోరీ, ఎమోషన్‌ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి.. ఆ సినిమాలో కనిపించనున్న పాత్ర ఆయన కెరీర్‌ లో మరో ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని వినికిడి. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ ఇమేజ్‌ కు తగ్గట్టుగా తీశారట.

ఏదేమైనా ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పుడు సర్ప్రైజ్ సాంగ్ ఉండనున్నట్లు తెలియడంతో ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో థియేటర్లలో నేరుగా సందడి చేసే ప్రత్యేకమైన ఆ పాట ఎంతటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. మొత్తానికి.. సర్ప్రైజ్ సాంగ్ ఉండడం నిజమైతే.. అభిమానుల ఆనందానికి అవధులు ఉండవేమో!!