Begin typing your search above and press return to search.

దసరాకి వర ప్రసాద్ స్టెప్పులు..?

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాగా మన శంకర వరప్రసాద్ వస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   7 Sept 2025 10:00 PM IST
దసరాకి వర ప్రసాద్ స్టెప్పులు..?
X

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాగా మన శంకర వరప్రసాద్ వస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఈమధ్యనే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ వదిలారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని టాక్. మెగా మూవీ ఛాన్స్ ని భీమ్స్ అన్ని విధాలుగా వాడుకోవాలని చూస్తున్నాడు.

చిరు సినిమా కోసం అనిల్ ప్లానింగ్..

ఐతే సినిమా ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉంటాడు. చిరు సినిమా కోసం కూడా అనిల్ ప్లానింగ్ అదే రేంజ్ లో ఉంది. ఇప్పటికే గ్లింప్స్ తోనే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసిన డైరెక్టర్ నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ రెడీ అవుతుందట. నెక్స్ట్ బిగ్ ఫెస్టివల్ దసరా ఉంది కదా.. దసరాకి మెగాస్టార్ స్టెప్పులతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాలని ఫిక్స్ అయ్యాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

డ్యాన్సుల్లో మెగాస్టార్ గ్రేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే చిరు ఈమధ్య డ్యాన్స్ విషయంలో కూడా సరైన కాన్సెట్రేషన్ చేయట్లేదన్న టాక్ కూడా ఉంది. ముఖ్యంగా సినిమాలో ఒకటి రెండు సాంగ్స్ లో ఒక మ్యాజిక్ హుక్ స్టెప్స్ ఉంటాయి. మన శంకర వరప్రసాద్ లో అలాంటివి ట్రై చేస్తున్నాడట. భీంస్ కూడా మెగాస్టార్ స్టెప్పులు అదరగొట్టేలా మ్యూజిక్ ఇస్తున్నాడట.

దసరాకి సాంగ్ రిలీజ్..

సో దసరాకి సాంగ్ రిలీజ్ చేసేలా అందులో స్టెప్పు అదిరిపోయేలా చూస్తున్నారట. 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేసిన మన శంకర వరప్రసాద్ సినిమా భారీ అంచనాలను సెట్ చేసుకుంది. ఈ సినిమాతో అనిల్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు. సంక్రాంతి డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి శంకర వరప్రసాద్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

చిరంజీవి నయనతార కాంబినేషన్ లో ఇదివరకు సైరా నరసింహా రెడ్డి వచ్చింది. ఐతే అది వేరే జోనర్ సినిమా.. ఇది అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్ కాబట్టి తప్పకుండా ఈ జోడీ ఇంప్రెస్ చేసేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా నుంచి చిరు బర్త్ డే రోజు రిలీజ్ చేసిన టీజర్ ఇంప్రెస్ చేసింది. మన శంకర్ వరప్రసాద్, విశ్వంభర రెండు సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ పై మెగా మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు.