దీవాళీ పోస్టర్.. మెగాస్టార్ లుక్కు అదిరింది..!
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి దీపావళి పోస్టర్ ఒకటి రిలీజైంది.
By: Ramesh Boddu | 20 Oct 2025 1:12 PM ISTమెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి దీపావళి పోస్టర్ ఒకటి రిలీజైంది. ఈ పోస్టర్ చూస్తే సైకిల్ మీద మెగాస్టార్ చిరంజీవి మరో ఇద్దరు పాపలు ఆయనతో కలిసి సైక్లింగ్ చేస్తున్నారు. సినిమాలో చిరు స్కూల్ పి.ఈ.టీ అని వార్తలు రాగా ఆమధ్య ప్రెస్ మీట్ లో చిరంజీవి క్యారెక్టర్ లో వేరియేషన్స్ ఉంటాయని అనిల్ రావిపూడి చెప్పాడు.
మీసాల పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్..
ఇక రీసెంట్ గా రిలీజైన మీసాల పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ని ఉదిత్ నారాయణ పాడటంతో సాంగ్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో మీసాల పిల్ల సాంగ్ సెన్సేషన్ గా మారింది. ఇక లేటేస్ట్ గా దీపావళి కానుకగా మన శంకర వరప్రసాద్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమాలో హీరో పాత్రలు చాలా ఇంప్రెసివ్ గా ఉంటారు. మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ గా తనకు తానుగా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిలో కూడా ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్ ని మన శంకర వరప్రసాద్ లో చూపించబోతున్నారని తెలుస్తుంది.
సినిమా ఎలా తీయాలో కాదు ఎలా ప్రమోట్ చేయాలో కూడా..
ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో మెగా ఫ్యాన్స్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో పెట్టుకోగా నెక్స్ట్ సాంగ్ తో మరింత బజ్ పెంచారు. ఒక సినిమా ఎలా తీయాలో కాదు ఎలా ప్రమోట్ చేయాలో కూడా తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అన్నట్టుగా మాస్టర్ క్లాస్ గా మారాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి అనిల్ సినిమా అంటే అది కచ్చితంగా సూపర్ హిట్టే అనే రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
మెగాస్టార్ మన శంకర్ వరప్రసాద్ సినిమా టీజర్ తో అదరగొట్టి నెక్స్ట్ సాంగ్ తో క్రేజ్ పెంచేసి ఇప్పుడు దీవాలి పోస్టర్ తో కూడా ఇంపాక్ట్ చూపించారు. సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ అయ్యేలా ఉంది. సంక్రాంతికి మెగా మాస్ ఎంటర్టైనర్ గా మన శంకర వరప్రసాద్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడు.
మన శంకర వరప్రసాద్ లో మరో స్పెషల్ సర్ ప్రైజ్ మన విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో రోల్ చేస్తున్నారట. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు లెజెండ్స్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనిల్ చేసే ఆ మ్యాజిక్ చూసేందుకు సంక్రాంతికి త్వరగా రావాలని ఆడియన్స్ భావిస్తున్నారు.
