Begin typing your search above and press return to search.

మన శంకరవరప్రసాద్ గారు.. 2వ రోజు టోటల్ ఎంత వచ్చాయంటే..

సంక్రాంతి పండుగ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడే అసలు సిసలైన జోరు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ మేనరిజమ్స్‌తో థియేటర్లలో చేస్తున్న రచ్చకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

By:  M Prashanth   |   14 Jan 2026 12:06 PM IST
మన శంకరవరప్రసాద్ గారు.. 2వ రోజు టోటల్ ఎంత వచ్చాయంటే..
X

సంక్రాంతి పండుగ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడే అసలు సిసలైన జోరు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ మేనరిజమ్స్‌తో థియేటర్లలో చేస్తున్న రచ్చకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో చిరంజీవిని పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయడంతో, 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కేవలం అభిమానులకే కాకుండా, సామాన్య ప్రేక్షకులకు కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.





మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. పండుగ సెలవులు ప్రారంభం కావడంతో అన్ని సెంటర్లలోనూ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. కేవలం సింగిల్ స్క్రీన్స్‌లోనే కాకుండా, మల్టీప్లెక్స్‌లలో కూడా ఈ మెగా ఎంటర్‌టైనర్‌కు టికెట్లు దొరకడం గగనమైపోతోంది. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో టికెట్ల కోసం ఆడియన్స్ పోటీ పడుతున్నారు.

ఇక అసలు వసూళ్ల విషయానికి వస్తే, 'మన శంకర వరప్రసాద్ గారు' రెండు రోజుల్లోనే భారీ మార్కును అందుకుంది. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని మేకర్స్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అనిల్ రావిపూడి వరుసగా ఆరోసారి 100 కోట్ల క్లబ్‌లో చేరడం మరో రికార్డ్.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తన కెరీర్‌లో ఈ సంక్రాంతి ఎంతో ప్రత్యేకమైనదని, కేవలం రెండు రోజుల్లోనే 120 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులను నవ్వించడమే తన లక్ష్యమని, చిరంజీవి గారిని అలా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

సినిమా సక్సెస్ మీట్‌లో కూడా అనిల్ తనపై వచ్చే ట్రోల్స్ గురించి చాలా స్పోర్టివ్‌గా మాట్లాడారు. సోషల్ మీడియాలో తన గురించి వచ్చే మీమ్స్ చూసి తాను కూడా ఎంజాయ్ చేస్తానని, కానీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణే తన కష్టానికి దక్కిన ప్రతిఫలమని ఆయన చెప్పారు. ఇక ముందు ముందు పండుగ సెలవులు ఇంకా ఉండటంతో, ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైన ఈ చిత్రం, లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ మ్యాజిక్ అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తోడవ్వడంతో, 'మన శంకర వరప్రసాద్ గారు' ఈ సంక్రాంతికి అసలైన విన్నర్‌గా నిలిచారని ఫ్యాన్స్ చెబుతున్నారు.