Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని 'మై బాస్' అంటూ హీటెక్కించిన వెంకీ!

తాజాగా వెంకీ సెట్స్ కు వెళ్తోన్న నేప‌థ్యంలో చిత్ర బృందం వెంకీని గ్రాండ్ గా ఆన్ సెట్స్ కు ఆహ్వానించారు.

By:  Srikanth Kontham   |   23 Oct 2025 1:31 PM IST
మెగాస్టార్ ని మై బాస్ అంటూ హీటెక్కించిన వెంకీ!
X

మెగాస్టార్ చిరంజీవి-విక్ట‌రీ వెంక‌టేష్ ఒకే ప్రేమ్ లో కనిపించ‌డానికి రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` అంటూ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న చిత్రం ఇద్ద‌ర్నీ తొలిసారి క‌లుపుతుంది. ఐదు దాబ్దాల ప్ర‌యా ణంలో చిరంజీవి-వెంకటేష్ ఎన్నో సినిమాలు వేర్వేరుగా చేసారు. కానీ ఏనాడు క‌లిసి ప‌ని చేయ‌లేదు. ఎవ‌రికి వారుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగి త‌మ‌కంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ప్ర‌యాణాలు మందుకు సాగించారు.

తాజాగా మారిన ట్రెండ్ లో సీనియ‌ర్లు సైతం మేము కూడా అంటూ క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ నేపథ్యంలో `మ‌న శంక‌ర‌ వ‌రప్ర‌సాద్` లో విక్ట‌రీ కీల‌క భాగ‌స్వామిగా మారారు. సినిమాలో వెంకీ ఓ కీల‌క పాత్ర పోషిస్తు న్నారు. ఇందులో చిరంజీవి-వెంకీ మ‌ధ్య బోలెడ‌న్ని కాంబినేష‌న్ స‌న్నివేశాలు ఉండ‌బోతున్నాయి. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం కాబ‌ట్టి చిరు-వెంకీ మ‌ధ్య కామెడీ ట్రాక్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇద్ద‌రు కామెడీ టైమింగ్ ఉన్న న‌టులు. ప్ర‌త్యేకించి వెంకీ కామెడీకి ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న‌కు చిరు కూడా తోడ‌వుతున్న నేప‌థ్యంలో ఆ కామెడీ పీక్స్ లో ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా వెంకీ సెట్స్ కు వెళ్తోన్న నేప‌థ్యంలో చిత్ర బృందం వెంకీని గ్రాండ్ గా ఆన్ సెట్స్ కు ఆహ్వానించారు. తాజాగా వెంకీ ఎంట్రీకి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో చిరంజీవి `వెల్క‌మ్ వెంకీ మై బ్ర‌ద‌ర్ అంటూ ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌గా ఆయ‌న ప్రేమ‌ను చూసిన వెంకీ ఫిదా అయ్యారు.

`చిరు సార్..మై బాస్` అంటూ అంతే ప్రేమాభిమానాన్ని వెంకీ చాటుకున్నారు. అదే వీడియోలో చిరంజీవి-వెంకీకి సంబం ధించిన పాత సినిమా స‌న్నివేశాలు మిక్స్ చేసారు. వాటిలో ఇద్ద‌రి ఎలివేష‌న్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. సీని య‌ర్ హీరోలిద్ద‌ర్ని అభిమానులు ఇలా చూసుకుని మురిసిపోతున్నారు. పాత ఎలివేష‌న్ సీన్సే ఇలా ఉంటే? మ‌న శంక‌ర‌వరప్ర‌సాద్ లో యాక్ష‌న్ ఎలివేష‌న్ ఇంకే రేంజ్ లో ఉంటుందంటూ ఊహ‌కే వ‌దిలేస్తున్నారు.