MSG ట్రైలర్ రన్ టైమ్ ఫిక్స్.. చిరు లుక్ మామూలుగా లేదుగా..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 3 Jan 2026 5:27 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మంచి ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. సంక్రాంతికి కానుకగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జనవరి 12వ తేదీన సినిమా విడుదల కానుండగా.. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, అప్డేట్స్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ చేశాయి. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా అభిమానులైతే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. థియేట్రికల్ ట్రైలర్ ను జనవరి 4న ఆదివారం తిరుపతిలో ఎస్వీ సినీ ప్లెక్స్ లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.
రన్ టైమ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ మొత్తం 2 నిమిషాల 30 సెకన్లు ఉండనుందని తెలిపారు. అంతే కాదు.. దర్శకుడు అనిల్ రావిపూడి ఎడిట్ రూమ్ నుంచి ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో స్క్రీన్ పై మెగాస్టార్.. గన్ పట్టుకుని షూట్ చేస్తున్నట్లు కనిపిస్తుండగా.. ముందు నిల్చుని అనిల్ రావిపూడి కూడా అదే పోజ్ ఇచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మేకర్స్ లేటెస్ట్ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. దీంతో ట్రైలర్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు సినీ ప్రియులు, మెగా అభిమానులు. ఇప్పుడు మేకర్స్ షేర్ చేసిన పిక్ తో ట్రైలర్ పై ఇంకా ఆసక్తి పెరిగిందని చెబుతున్నారు. అందరికీ పూనకాలేనని, చిరు లుక్ అదిరిపోయిందని అంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన స్క్రీన్ టైమ్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కేథరీన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చుతుండగా.. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను సినిమా థియేటర్లకు కచ్చితంగా రప్పిస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఏదేమైనా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
