Begin typing your search above and press return to search.

MSG మూవీ ట్రైలర్.. చిరు స్వాగ్ నెవ్వర్ బిఫోర్..

సినిమాలో చిరంజీవి రా (RAW) ఏజెంట్‌, ఎన్‌ఎస్‌ఏ అధికారిగా కనిపించనున్నారు. శశిరేఖ అంటూ పిలిచే ప్రతిసారి కూడా వింటేజ్ చిరును గుర్తు చేస్తూ థియేటర్లలో విజిల్స్ పడేలా ఉన్నాయి.

By:  M Prashanth   |   4 Jan 2026 4:37 PM IST
MSG మూవీ ట్రైలర్.. చిరు స్వాగ్ నెవ్వర్ బిఫోర్..
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌ లో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు (MSG) ట్రైలర్‌ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. తిరుపతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు.

ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. మీసాల పిల్ల, శశిరేఖ, మెగా విక్టరీ వంటి పాటలు చార్ట్‌ బస్టర్లుగా నిలిచి సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తుండగా.. ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. మెగాస్టార్ అభిమానులు ఆశించే అన్ని అంశాలతో ఉన్న ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచేసింది.

ట్రైలర్‌ లో చిరంజీవి లుక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. యంగ్‌ గా, ఫ్రెష్‌ గా, స్టైలిష్‌ గా కనిపిస్తూ తన వింటేజ్ కామిక్ టైమింగ్‌ ను మరోసారి రుచి చూపించారు. ఎనర్జీ, స్టైల్, స్వాగ్, యాక్షన్.. ప్రతి ఫ్రేమ్‌ లో కూడా మెగాస్టార్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన స్టైల్, స్వాగ్ నెవ్వర్ బిఫోర్ లా ఉంది. డైలాగ్ డెలివరీ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.

సినిమాలో చిరంజీవి రా (RAW) ఏజెంట్‌, ఎన్‌ఎస్‌ఏ అధికారిగా కనిపించనున్నారు. శశిరేఖ అంటూ పిలిచే ప్రతిసారి కూడా వింటేజ్ చిరును గుర్తు చేస్తూ థియేటర్లలో విజిల్స్ పడేలా ఉన్నాయి. అనిల్ రావిపూడి చెప్పినట్లు.. చిరంజీవిని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్న ఫుల్ ఎంటర్టైనర్‌ ను అందించానన్న హామీని ట్రైలర్‌ తోనే నెరవేర్చినట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా నయనతార, చిరంజీవి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ట్రైలర్‌ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో చిరంజీవికి దూరమైన భార్యగా నయనతార కనపడడం ఆసక్తిని పెంచుతోంది. ఇక అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఆన్‌ స్క్రీన్ కాంబినేషన్ ట్రైలర్‌ లో చిన్న టీజర్‌ లా చూపించి అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ఏదేమైనా ట్రైలర్ ను తనదైన శైలిలో కట్ చేశారు అనిల్ రావిపూడి. కథలో కీలక మలుపులు బయటపడకుండా చూసుకున్నారు. నిర్మాణ విలువలు టాప్ నాచ్‌ గా ఉండి హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓవరాల్ గా ట్రైలర్.. డైలాగ్స్, విజువల్స్ సహా అన్ని విషయాల్లో ఆకట్టుకుంటూ ఫుల్ ప్యాక్ గా ఉందని చెప్పాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో అనిల్ రావిపూడి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న MSG మూవీ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ట్రైలర్‌ తో మరింత బలపడింది. మరి చూడాలి ఏం జరుగుతుందో..