మన శంకరవరప్రసాద్ గారు.. అసలు సర్ ప్రైజ్ ఆ రోజే..
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరూ ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఊహించుకున్నారు.
By: M Prashanth | 2 Jan 2026 3:03 PM ISTమెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరూ ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఊహించుకున్నారు. కానీ 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG) నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే లెక్క మారుతున్నట్లు అనిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్ల జోరు పెంచేసిన చిత్ర బృందం, తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించి ఫ్యాన్స్ లో హీట్ పెంచేసింది. జనవరి 4న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఈ అనౌన్స్ మెంట్ తో పాటు వదిలిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైట్ షర్ట్, డార్క్ ప్యాంట్ వేసుకుని, చేతిలో షాట్ గన్ పట్టుకుని మోకాళ్ళపై కూర్చున్న చిరంజీవి లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చుట్టూ గాల్లో ఎగురుతున్న కాగితాలు, వెనుక యాక్షన్ మూడ్ చూస్తుంటే.. ఇది కేవలం కామెడీ మాత్రమే కాదు, పక్కా మాస్ యాక్షన్ డ్రామా అని స్పష్టంగా అర్థమవుతోంది. బాస్ లుక్ లో ఆ రగ్గడ్ నెస్, స్టైల్ చూస్తుంటే వింటేజ్ చిరు గుర్తుకు వస్తున్నారు.
సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు అంటే నవ్వులు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ పోస్టర్ లోని విజువల్స్ చూస్తుంటే, ఈసారి ఆయన రూట్ మార్చి క్రైమ్ డ్రామా ఛాయలతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ ని దించేలా ఉన్నాడు. "మాస్" ఎలిమెంట్స్ ని దట్టించి, చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు ఈ లుక్ హింట్ ఇస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు మాస్ ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా ఒక విందు భోజనంలా ఉండబోతోంది.
ఈ సినిమాకు ఉన్న మరో ఆయుధం విక్టరీ వెంకటేష్. ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఇది ఈ సీజన్ లోనే అతిపెద్ద మల్టీస్టారర్ గా మారింది. చిరు వెంకీ కాంబినేషన్ స్క్రీన్ మీద చూడటం అనేది ఆడియెన్స్ కి ఒక కన్నుల పండుగ. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండటం సినిమా స్పాన్ ని మరింత పెంచింది.
ఇప్పటికే భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాపై బజ్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. "మీసాల పిల్ల", "సంక్రాంతి అదిరిపోద్ది" వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణ విలువలు కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయని పోస్టర్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది.
జనవరి 4న ట్రైలర్ తో అసలైన విశ్వరూపం చూపించడానికి టీమ్ రెడీ అయ్యింది. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి పండగకు ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ పర్ఫెక్ట్ సినిమాగా 'MSG' నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్ లో అనిల్ రావిపూడి ఇంకెన్ని సర్ప్రైజ్ లు దాచాడో చూడాలి.
