Begin typing your search above and press return to search.

ప్రోమో: మెగా గ్రేస్ హైలెట్ అయ్యేలా 'మీసాల పిల్లా' బీట్

మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తరువాత ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే సినిమాతో రాబోతున్నారు. ఆయనలోని గ్రేస్, క్లాస్, మాస్ అన్నీ వేరే లెవెల్‌లో ఉంటాయి.

By:  M Prashanth   |   2 Oct 2025 10:16 PM IST
ప్రోమో: మెగా గ్రేస్ హైలెట్ అయ్యేలా మీసాల పిల్లా బీట్
X

మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తరువాత ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే సినిమాతో రాబోతున్నారు. ఆయనలోని గ్రేస్, క్లాస్, మాస్ అన్నీ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఆ మ్యాజిక్ ని తిరిగి చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధమయ్యారు. మెగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు నుంచి మొదటి సింగిల్ "మీసాల పిల్లా" ప్రోమో రిలీజ్ అయింది.

ఈ దసరా కానుకగా విడుదలైన ఈ పాట ప్రోమో, మెగా అభిమానుల్లో హైప్‌ని రెట్టింపు చేసింది. సాహు గరపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయిన సమయంలో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయడంతో అభిమానుల్లో హంగామా నెలకొంది.

"మీసాల పిల్లా"ని యూనిట్ సభ్యులు మెగా గ్రేస్ సాంగ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే చిరు అందించే ఆ అందమైన డాన్స్ మూవ్స్, చిరునవ్వులు, గ్రేస్ అన్నీ మళ్లీ తెరపైకి వచ్చాయి. సాంగ్‌కు ముందు చిరంజీవి నయనతార మధ్య జరిగే సంభాషణ అభిమానులకు పాత రోజుల్ని గుర్తు చేసింది. చిరు స్టైల్లో వేసే చిన్న చిన్న టీజ్‌లు, ఆయన టైమింగ్‌తో వచ్చే కామెడీ బీట్స్ అందరినీ కట్టిపడేశాయి.

అనిల్ రావిపూడి చెప్పినట్టే, మెగాస్టార్‌లో అభిమానులు ఇష్టపడే ప్రతి ఫేస్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆ ప్రయత్నం సాంగ్ ప్రమోలోనే స్పష్టమైంది. ఈ పాటకు సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్లేబ్యాక్ సింగర్. చిరంజీవి కెరీర్ లో పలు సూపర్‌హిట్ పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ మళ్లీ ఈ సినిమాలో పాడారు. ఆయన గాత్రం వినిపించగానే పాత మెగా మ్యూజిక్ డేస్ గుర్తుకొస్తాయి.

భీమ్స్ మెలోడీతో కూడిన మెలోడీ బీట్‌ని ఇచ్చారు. అందుకే "మీసాల పిల్లా" ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం, సినిమాలో నాలుగు పాటలన్నీ మెగా క్లాస్, మెగా స్వాగ్, మెగా విక్టరీ మాస్ అనే కాన్సెప్ట్స్‌తో వేరువేరుగా ఉండబోతున్నాయి. అంటే ఒక్కో పాటలో మెగాస్టార్ కొత్త యాంగిల్ కనిపించబోతుంది. ఈ సాంగ్స్ అన్నీ కలిసే సంక్రాంతి 2026కు మెగా ఫెస్టివల్ లాంటి ఫీల్ ఇవ్వనున్నాయి.