MSG హుక్ స్టెప్ సాంగ్: బాస్ స్టైల్- స్వాగ్‌కి గూస్‌బంప్స్
తాజాగా చిత్ర బృందం అల్టిమేట్ మెగా స్వాగ్ సాంగ్ `హుక్ స్టెప్`ను విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవి స్టైలిష్ కాస్ట్యూమ్, యాక్సెసరీస్.. ఆయన ఎనర్జీ వేరే స్థాయిలో కుదిరాయి.
By: Sivaji Kontham | 7 Jan 2026 10:25 PM ISTమెగాస్టార్ చిరంజీవి- వెంకీ రేర్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి రూపొందించిన `మన శంకర వర ప్రసాద్ గారు` సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సాహు గారపాటి - సుష్మిత కొణిదెల నిర్మించారు. నయనతార, కేథరిన్ కథానాయికలు. వెంకీ ఈ చిత్రంలో 45 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం.
ఇప్పటికే విడుదలైన ఆడియో, టీజర్, ట్రైలర్ ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ స్వాగ్, స్టైల్ అద్భుతంగా కుదిరాయి. మెగాస్టార్ స్టైల్, హాస్యచతురత, పరాచికం ఇవన్నీ ఒక కొత్తదనాన్ని తెరపై ఆవిష్కరించాయని చెబుతున్నారు. తాజాగా చిత్ర బృందం అల్టిమేట్ మెగా స్వాగ్ సాంగ్ `హుక్ స్టెప్`ను విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవి స్టైలిష్ కాస్ట్యూమ్, యాక్సెసరీస్.. ఆయన ఎనర్జీ వేరే స్థాయిలో కుదిరాయి. ప్రతి ఫ్రేమ్‌లో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో మెగా బాస్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఆయన స్టైలింగ్ మరోసారి తెలుగు సినిమాకు స్టైలిష్ స్వాగ్ ని జోడించింది. ఈ పాటకు ఆయన వేసిన హుక్ స్టెప్ సూపర్ క్లాసీగా, ట్రెండీగా కుదిరింది.
ఇప్పటికే చిరు తన సినిమాల్లో చాలా హుక్ స్టెప్పులతో అలరించారు. వాటన్నిటికీ బాస్ లాంటిది ఈ హుక్ స్టెప్. ఈ స్టెప్ లెవలేంటో థియేటర్లలో వీక్షిస్తేనే బావుంటుంది. పాటలో ఈ స్టెప్ సర్ప్రైజ్ కోసం వేచి చూడాలి. హుక్ స్టెప్ పాటలో మెగా డ్యాన్సులకు ప్రేక్షకులు గగ్గోలు పెట్టడం ఖాయం. బాబా సెహగల్ ఈ పాటను పాడటంతో పాత కాలం నాటి వైబ్ ని జోడించినట్టయింది. ఇప్పటికే విడుదలైన ప్రతి పాట భారీ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఈ పాట మెగా-విక్టరీ మాస్ సాంగ్‌తో పాటు థియేటర్లలో ఒక పెద్ద సంచలనం సృష్టించబోతోంది. అనీల్ రావిపూడి ఒక అభిమానిగా ఈ సినిమాని తెరకెక్కించడంతో ఆ ఎలివేషన్ ప్రతి ఫ్రేమ్‌లోను కనిపిస్తుందని చెబుతున్నారు.. సంక్రాంతి బరిలో మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద మెగా సునామీగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
