'MSG' చిరు వెంకీ.. క్లైమాక్స్‌లో అసలు మ్యాజిక్!
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్ల కోసం ఫ్యాన్స్ దశాబ్దాలుగా ఎదురుచూస్తారు. అలాంటి ఒక డ్రీమ్ కాంబో.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది అభిమానుల కల.
By: M Prashanth | 2 Nov 2025 9:42 PM ISTటాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్ల కోసం ఫ్యాన్స్ దశాబ్దాలుగా ఎదురుచూస్తారు. అలాంటి ఒక డ్రీమ్ కాంబో.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది అభిమానుల కల. ఇప్పుడు ఆ కలను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నిజం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమానే 'మన శంకర వర ప్రసాద్ గారు'. ఈ సినిమాలో వెంకటేష్ ఒక పవర్‌ఫుల్ ఎక్స్‌టెండెడ్ క్యామియో చేస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఒక హాట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సినిమాకే హైలైట్‌గా నిలవబోయే స్టైలిష్ క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా మొదలైంది. ఈ క్లైమాక్స్‌లోనే చిరంజీవి, వెంకటేష్ డిఫరెంట్ ఎపిసోడ్ లో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. దీంతో ఈ ఫైనల్ యాక్షన్ ఘట్టంపై అంచనాలు హై లెవల్లో పెరిగాయి.
అయితే, ఇది రెగ్యులర్ క్లైమాక్స్ లాగా ఉండబోదని డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇస్తున్నారు. కేవలం ఫైట్స్, యాక్షన్‌తో కాకుండా, ఈ క్లైమాక్స్‌ను చాలా డిఫరెంట్‌గా, ఫన్నీగా డిజైన్ చేశారట. ఇందులో మెగాస్టార్ మార్క్ స్టైల్, ఆయనలోని హ్యూమర్, ఎనర్జీని మునుపెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నారు.
రీసెంట్ టైమ్స్‌లో ఫ్యాన్స్ మిస్ అవుతున్న మెగాస్టార్ స్వాగ్, గ్రేస్, స్టైల్‌ను ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఫుల్లుగా వాడుకుంటున్నారని టాక్. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్‌తో కలిసి డిజైన్ చేసిన ఈ క్లైమాక్స్, ఫ్యాన్స్‌కు ఒక వింటేజ్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఒక పక్కా ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన 'మీసాల పిల్ల' సాంగ్, రీజినల్ ఫిల్మ్ అయినా పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అయ్యి మెగా గ్రేస్ పవర్ ఏంటో చూపించింది. ఈ మెగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాను ముందుగా ప్రకటించినట్లే, 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి టీమ్ పక్కా ప్లానింగ్‌తో ఉంది.
