Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేస్.. సరికొత్త రికార్డు సృష్టించిన చిరు మూవీ..

ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా తెలుగు చిత్రాలు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీని ఇస్తున్నాయి. ఒక చిత్రాన్ని మించిన మరొక చిత్రం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.

By:  Madhu Reddy   |   17 Jan 2026 1:05 AM IST
సంక్రాంతి రేస్.. సరికొత్త రికార్డు సృష్టించిన చిరు మూవీ..
X

ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా తెలుగు చిత్రాలు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీని ఇస్తున్నాయి. ఒక చిత్రాన్ని మించిన మరొక చిత్రం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అన్నీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు కావడంతో అటు ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతి పండుగను మరింత కన్నులు విందుగా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో మొదలైన ఈ సంక్రాంతి సినిమాల హడావిడి.. మరింత జోరుగా కొనసాగుతోంది. అందులో భాగంగానే జనవరి 12వ తేదీన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.




ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఏకంగా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు 5 రోజుల్లోనే ఏకంగా 200 కోట్ల క్లబ్లో చేరి బాక్సాఫీస్ వద్ద చిరు కెరియర్లో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన 3వ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ కలెక్షన్లు చూసి అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వరుస కలెక్షన్లు రాబడుతూ సునామీ సృష్టిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు థియేటర్లు కూడా హౌస్ ఫుల్ తో నిండిపోతున్నాయి.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మొదటి రోజు నుంచీ ఐదవ రోజు కూడా ప్రతి చోట అదనపు షోలతో సహా టిక్కెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోతూ ఉండడం గమనార్హం. అటు ముగింపు దశలో ఉన్న పాత థియేటర్లు కూడా తిరిగి తెరవబడ్డాయి. ముఖ్యంగా ప్రదర్శన కారులను ఆశ్చర్యపరుస్తూ ముందుగానే టికెట్లు బుక్ అవుతూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమా 200 కోట్ల మార్కును సాధించిన చిరంజీవి మూడవ చిత్రంగా నిలవగా.. అనిల్ రావిపూడి కి నాలుగవచిత్రంగా నిలిచింది. ఇక ఇందులో విక్టరీ వెంకటేష్ అతిది పాత్ర పోషించారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు..

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా పూర్తి చేశారు. ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా విడుదల కామవుతోంది. అలాగే ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో చిరంజీవి బెంగాల్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది .ఇక మళ్లీ ఈ కాంబినేషన్లో మూవీ అనడంతో అభిమానులలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి బాబి చిరంజీవిని మాఫియా డాన్ గా చూపించబోతున్నారు. మరి ఆడియన్స్ ఏ విధంగా స్వీకరిస్తారో చూడాల్సి ఉంది.